Breaking News

Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్‌ కావాల్సినోడు.. 

Published on Wed, 09/20/2023 - 17:30

Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్‌ప్రీత్‌ కౌర్ సారథ్యంలో వుమెన్స్‌ టీమ్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి.

అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్‌ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

రెంటికీ చెడ్డ రేవడి
ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.


సంజూ శాంసన్‌

ఆసియా కప్‌లో అలా.. వరల్డ్‌కప్‌జట్టులో ఇలా
కేఎల్‌ రాహుల్‌ ఆగమనంతో ఆసియా కప్‌-2023లో వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్‌లో అతడిని దురదృష్టం వెక్కిరించింది.

కెప్టెన్‌ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా?
ప్రపంచకప్‌-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్‌ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది.

ఆసియా కప్‌లో రిజర్వ్‌గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం లేదు. రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి శుబ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు.

ఇషాన్‌కు వరుస అవకాశాలు
ఇషాన్‌ మిడిలార్డర్‌లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్‌మెంట్‌ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్‌ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్‌కప్‌ టీమ్‌లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్‌ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్‌లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్‌ అవ్వాల్సింది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్‌.. వీడియో వైరల్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)