నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
అర్జున్- సానియా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు: సచిన్
Published on Thu, 02/26/2026 - 16:07
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్- అంజలిల కుమారుడు అర్జున్ టెండుల్కర్ సానియా చందోక్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. మార్చి తొలివారంలో ఈ పెళ్లి వేడుక జరుగనుంది.
ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం అర్జున్- సానియాల ప్రీవెడ్డింగ్ వేడుకలను జామ్‌నగర్‌లో నిర్వహించింది. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ.. కుమారులు, కోడళ్లు ఆకాశ్, అనంత్.. శ్లోకా, రాధికా హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్- అంజలి తమ కుటుంబంలోని వ్యక్తులు అంటూ నీతా అంబానీ సచిన్ ఫ్యామిలీతో తమకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు.
ముకేశ్ భాయ్, నీతా వదినమ్మ.. థాంక్యూ
ఇందుకు బదులిస్తూ సచిన్ టెండుల్కర్ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘వధూవరులకు ఆశీర్వాదాలు ఇచ్చేందుకు ఇంతకంటే గొప్ప వేదికను మేము ఎంపిక చేసే వాళ్లము కాదు. పిల్లల కోసం ఇంతగా ఆలోచించినందుకు మీకు ధన్యవాదాలు. ముకేశ్ భాయ్, నీతా వదినమ్మ.. అనంత్, ఆకాశ్‌లు మా పట్ల చూపిన ప్రేమాభిమానాలకు ధన్యులం’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు.
అర్జున్- సానియా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు
ఇక కాబోయే దంపతులు అర్జున్- సానియా గురించి మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయిని కొడుకు ఇంటికి తీసుకువచ్చి మనకు ప్రత్యేకంగా పరిచయం చేశాడంటే... అప్పుడు మన కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడని అర్థం. అర్జున్- సానియా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.
ప్రత్యేకమైన వ్యక్తి
అర్జున్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ప్రత్యేకమైన వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నావు. నువ్వెంతగా ఆమెను ప్రేమిస్తావో.. ఆమె కూడా నిన్ను అంతగా ప్రేమిస్తోంది’’ అంటూ కాబోయే కోడలిపై ఆప్యాయత, అనురాగాలు కురిపించాడు సచిన్. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.
అంబానీలతో అనుబంధం
కాగా ఐపీఎల్‌లో అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుకు సచిన్ టెండుల్కర్ ప్రాతినిథ్యం వహించాడు. అదే జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. ఇక అర్జున్ సైతం చిన్ననాటి నుంచే అంబానీల స్కూల్‌లో విద్యార్థి. ముంబై ఇండియన్స్ జట్టులోనూ కొన్నాళ్లు ఉన్నాడు. అయితే, ఐపీఎల్-2026 వేలానికి ముందు ముంబై అర్జున్‌ను ట్రేడ్ చేసింది.
ఇదిలా ఉంటే.. అర్జున్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సానియా.. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు. ఆమె కూడా వ్యాపారరంగంలో ఉన్నారు. అన్నట్లు సానియా చందోక్.. అర్జున్ అక్క సారా టెండుల్కర్‌కు ప్రాణ స్నేహితురాలు. అర్జున్- సానియా వయసులో ఏడాది వ్యత్యాసం ఉంది. అర్జున్ కంటే సానియా సంవత్సరం పెద్దదని సమాచారం.
చదవండి: సోఫీ షైన్‌తో పెళ్లి.. శిఖర్ ధావన్‌కు శుభవార్త!.. మాజీ భార్యకు దిమ్మతిరిగే షాక్!
We are touched by your kind gesture, Mukesh bhai, Nita bhabhi, Anant and Akash.
Moments like these feel even more meaningful when shared with family and friends who have been part of the journey. https://t.co/eCYxoRBTvH— Sachin Tendulkar (@sachin_rt) February 26, 2026
Tags : 1