‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

Published on Thu, 06/04/2026 - 18:44

ఐపీఎల్‌-2026 ఆరంభంలో పంజాబ్‌ కింగ్స్‌ అద్భుత విజయాలు సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టేబుల్‌ టాపర్‌గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఊహించనిరీతిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. వచ్చే సీజన్‌ ఆరంభానికి ముందు ఈ ఐదుగురు ఆటగాళ్లను తప్పక వదిలించుకోవాలన్నాడు. ఇందులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌కు విహారి ప్రథమ స్థానం ఇచ్చాడు.

రూ. 11 కోట్లు అందుకునే అర్హత లేదు
తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. పంజాబ్‌ మొట్టమొదటగా మార్కస్‌ స్టొయినిస్‌ను వదిలేయాలి. అతడిని ఏకంగా రూ. 11 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ధరకు రిటైన్‌ చేసుకున్నారు.

ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడతాడని ఇంత ధర పెట్టారు. కానీ అందుకు అతడు అర్హుడు కాడు. వచ్చే రెండు- మూడేళ్లలో అతడు రిటైర్మెంట్‌కు చేరువవుతాడు. బౌలింగ్‌లోనూ అతడు ప్రభావం చూపడం లేదు.

వీళ్లను కూడా వదిలేయండి
అతడిని వేలంలోకి వదిలి.. కావాలంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. స్టొయినిస్‌తో పాటు నేహాల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, మిచెల్‌ ఓవెన్‌లను కూడా వేలంలోకి వదిలేయండి. అసలు వాళ్లతో ఈ సీజన్‌లో ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు.

లాకీ ఫెర్గూసన్‌ కూడా జట్టుకు అవసరం లేదు. వీళ్లందరినీ వదిలేస్తే పర్సులో కనీసం రూ. 25 కోట్లు మిగులుతాయి’’ అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌-2026లో  స్టొయినిస్‌ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 216 పరుగులు చేశాడు. అదే విధంగా నాలుగు మ్యాచ్‌లలో బౌలింగ్‌ చేసి రెండే వికెట్లు తీశాడు.

ఇక నేహాల్‌ వధేరా ఆరు ఇన్నింగ్స్‌ ఆడి 65 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు.. శశాంక్‌ సింగ్‌ సైతం తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 132 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫెర్గూసన్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా.. మిచెల్‌ ఓవెన్‌కు అసలు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు.

చదవండి: టీమిండియాలోకి కొత్త ప్లేయర్‌!

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)