Breaking News

వరంగల్‌ను చిత్తు చేసిన హైదరాబాద్‌

Published on Wed, 07/01/2026 - 14:14

తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్‌- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌, హైదరాబాద్‌ ఇ- చాంపియన్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన వరంగల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

వరంగల్‌  స్కోరెంతంటే?
వరంగల్‌ ఓపెనర్లలో హర్షిత్‌ చౌదరి (22) త్వరగానే వెనుదిరగగా.. కెప్టెన్‌ అమన్‌ రావు (20 బంతుల్లో 45) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషికేత్‌ 38 పరుగులు చేయగా.. మిగిలిన వారిలో శౌనక్‌ (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.

మురుగన్‌ అభిషేక్‌ (4) పూర్తిగా విఫలం కాగా.. ధీరజ్‌ 18, భవేశ్‌ 6, ఆది మణి కిరణ్‌ 5, ముదస్సర్‌ 3 పరుగులు చేసి నిష్క్రమించారు. క్రాంతి (2), సల్మాన్‌ అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వరంగల్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది.

హైదరాబాద్‌ బౌలర్లలో అజయ్‌ గౌడ్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. దేవ్‌ మెహతా, అఖిల్‌ రాథోడ్‌, షణ్ముఖ అశ్విన్‌, ప్రణవ్‌ వర్మ, అభిరథ్‌ రెడ్డి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఘన విజయం
లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ కేవలం 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి అజేయ శతకం (43 బంతుల్లో 101)తో అదరగొట్టగా.. గడుగు గణేశ్‌ అర్ధ శతకం (31 బంతుల్లో 50)తో అలరించాడు. వరంగల్‌ బౌలర్లలో సల్మాన్‌ ఖాన్‌, క్రాంతి, శౌనక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

తుదిజట్లు
వరంగల్‌
అమన్‌ రావు పేరాల (కెప్టెన్‌), భవేశ్‌ సేత్‌ (వికెట్‌ కీపర్‌), రిషికేత్‌ సిసోడియా, హర్షిత్‌ చౌదరి, మురుగన్‌ అభిషేక్‌, ఆది మణి కిరణ్‌, శౌనక్‌ కులకర్ణి, ముదస్సర్‌ హుసేన్‌, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్‌, సల్మాన్‌ ఖాన్‌.

హైదరాబాద్‌
అభిరథ్‌ రెడ్డి మందాడి (కెప్టెన్‌), సాయి వికాస్‌ రెడ్డి, గడుగు గణేశ్‌, వైష్ణవ్‌ రెడ్డి, ప్రణవ్‌ వర్మ, అరవింద్‌ (వికెట్‌ కీపర్‌), అజయ్‌ దేవ్‌ గౌడ్‌, దేవ్‌ మెహతా, అఖిల్‌ రాథోడ్‌, ఎంఏ షణ్ముఖ.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)