ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
క్వాలిఫయర్-2కు కరీంనగర్ డైమండ్స్
Published on Thu, 07/09/2026 - 17:28
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో ఉప్పల్ వేదికగా రంగారెడ్డి రైజర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 75 పరుగుల తేడాతో కరీంనగర్ ఘన విజయం సాధించింది. దీంతో కరీంనగర్ జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఎలిమినేటర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో ఏకంగా 137 పరుగులు రాబట్టాడు. ఈ టీజీ 20 లీగ్లో తన్మయ్కు ఇది మూడో సెంచరీ.
తన్మయ్తో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సింహా అర్ధ శతకం (50)తో రాణించాడు. తన్మయ్, సింహా కలిసి రెండో వికెట్కు 69 బంతుల్లో ఏకంగా 139 పరుగులు జోడించారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప రెండు వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్, సచేత్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య చేధనలో రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్ స్పిన్నర్ ఆశిష్ శ్రీవాస్తవ్ 5 వికెట్లు పడగొట్టి కరీంనగర్ను దెబ్బతీశాడు. ఆశిష్ 3.3 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడితో పాటు శుభమ్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. రంగారెడ్డి బ్యాటర్లలో కెప్టెన్ తనయ్ త్యాగరాజన్(33 బంతుల్లో 63), నితన్ సాయి యాదవ్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
చదవండి: అలాంటి వాళ్లకు ఈ లోకంలో స్థానం ఉండదు: కపిల్ దేవ్
Tags : 1