Breaking News

చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్‌గా

Published on Sat, 06/14/2025 - 13:55

27 ఏళ్ల త‌ర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు సౌతాఫ్రికా కేవ‌లం 69 ప‌రుగుల దూరంలో నిలిచింది.  ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ప్రోటీస్ విజ‌యానికి చేరువైంది.

282 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి  రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికి సౌతాఫ్రికా తిరిగి పుంజుకుంది. ఐడైన్ మార్‌క్ర‌మ్‌(102 బ్యాటింగ్‌), బావుమా(65 బ్యాటింగ్‌) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.

వీరిద్దరూ మూడో వికెట్‌కు 143 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెలకొల్పారు. బావుమా ఓ వైపు గాయంతో బాధపడుతూనే తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బావుమా కీలక నాక్‌ ఆడాడు. ఈ క్ర‌మంలో టెంబా బావుమా ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

తొలి కెప్టెన్‌గా..
డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ చేసిన కెప్టెన్‌గా బావుమా నిలిచాడు. టెంబా బావుమా 3వ రోజు ముగిసే సమయానికి 121 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ పేరిట ఉండేది. విలియ‌మ్స‌న్ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో భార‌త్‌పై 52 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో విలియ‌మ్స‌న్ రికార్డును బావుమా బ్రేక్ చేశాడు.
చదవండి: 'మ్యాచ్ ఇంకా ముగియ లేదు'.. ప్రోటీస్‌కు ఆసీస్ కోచ్ వార్నింగ్‌

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)