Breaking News

ఆసియాక‌ప్ త‌ర్వాత టీమిండియా బిజీ బిజీ.. షెడ్యూల్ ఇదే

Published on Wed, 10/01/2025 - 16:56

ఆసియాకప్‌-2025 ఛాంపియన్స్‌గా నిలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది. టీమిండియా 3 నెలలపాటు మూడు ఫార్మాట్లలోనూ తలపడనుంది. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ ఢీకొట్టనుంది. ఈ క్రమంలో 2025 ఏడాదిలో టీమిండియా మిగిలిన షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.

వెస్టిండీస్‌తో రెడ్ బాల్ సమరం..
ఆసియాకప్ ముగిసిన మూడు రోజులకే వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అక్టోబర్ 2 నుంచి ఈ రెడ్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.

🔹వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌
1వ టెస్ట్: అక్టోబర్ 2–6, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
2వ టెస్ట్: అక్టోబర్ 10–14, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

విండీస్ సిరీస్ ముగిసిన 5 రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20ల్లో తలపడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌లు అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.

టీమిండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ఇదే..

వన్డే సిరీస్:

అక్టోబర్ 19: పెర్త్(తొలి వన్డే)

అక్టోబర్ 23: అడిలైడ్(రెండో వన్డే)

అక్టోబర్ 25: సిడ్నీ(మూడో వన్డే)

టీ20 సిరీస్:

అక్టోబర్ 29: మనుకా ఓవల్(తొలి టీ20)

నవంబర్ 2: మెల్‌బోర్న్(రెండో టీ20)

నవంబర్ 6: హోబర్ట్(మూడో టీ20)

నవంబర్ 8: గోల్డ్ కోస్ట్(నాలుగో టీ20)

నవంబర్ 10: బ్రిస్బేన్(ఐదో టీ20)

ఆ తర్వాత భారత పురుషుల జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.

భారత్‌-దక్షిణాఫ్రికా మల్టీ ఫార్మాట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..
టెస్ట్ సిరీస్:

నవంబర్ 14–18: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ(తొలి టెస్టు)

నవంబర్ 22–26: బర్సపారా స్టేడియం, గౌహతి(రెండో టెస్టు)

వన్డే సిరీస్:
నవంబర్ 30: రాంచీ(తొలి వన్డే)

డిసెంబర్ 3: రాయ్‌పూర్(రెండో వన్డే)

డిసెంబర్ 6: విశాఖపట్నం(మూడో టీ20)

టీ20 సిరీస్‌:

డిసెంబర్ 9: కటక్(తొలి టీ20)

డిసెంబర్ 11: న్యూ చండీగఢ్(రెండో టీ20)

డిసెంబర్ 14: ధర్మశాల(మూడో టీ20)

డిసెంబర్ 17: లక్నో(నాలుగో టీ20)

డిసెంబర్ 19: అహ్మదాబాద్(ఐదో టీ20)

👉ఆసీస్‌, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు పొట్టి ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జరగనున్నాయి.
 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు