టాస్ గెలిచిన టీమిండియా.. శ్రేయస్‌ అరుదైన ఫీట్‌

Published on Tue, 07/07/2026 - 21:35

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో ఓట‌మి పాలైన భార‌త్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను 1-1తో స‌మం చేయాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు ఇంగ్లండ్ మాత్రం విజ‌యం సాధించి ఆధిక్యంలో నిల‌వాల‌ని ఉవ్విళ్లూరుతోంది. 

ఈ మ్యాచ్‌కు టీమిండియా ఒక మార్పుతో బ‌రిలోకి దిగింది. ర‌వి బిష్ణోయి స్థానంలో ప్రిన్స్ యాద‌వ్ తుదిజ‌ట్టులోకి రాగా.. ఇంగ్లండ్ జ‌ట్టు ఎలాంటి మార్పులు చేయ‌లేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయాన్ని అందుకుంది.

అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే  కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఫీట్ సాధించాడు. భారత టీ20 కెప్టెన్‌గా అయ్యర్ టాస్ గెలవడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో అంతర్ర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్లలో అత్యధికసార్లు టాస్‌ నెగ్గిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మ, ధోనిలతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరికంటే ముందు  ఎంఎస్ ధోని ఏడుసార్లు (మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 వరకు), విరాట్ కోహ్లి ఆరుసార్లు (ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 2019 వరకు), తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్ర‌వ‌ర్తి

చదవండి: సెమీస్‌కు దూసుకెళ్లిన గాఫ్‌.. పిన్న వ‌య‌స్కురాలిగా చ‌రిత్ర‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)