Breaking News

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సం‍దడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్‌ ప్రోమో

Published on Mon, 08/08/2022 - 13:57

విండీస్‌ టూర్‌ ముగిసిందో లేదో అప్పుడే భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందడి మొదలైంది. ఆసియా కప్‌ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులైన ఈ రెండు దేశాలు ఆగస్ట్‌ 28న తలపడనున్నాయి. దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరానికి 20 రోజుల ముందుగానే వాతావరణాన్ని వేడెక్కించేందుకు టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ ఆసక్తికర ప్రోమోను విడుదల చేసింది. 

ఇందులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాక్‌తో సమరానికి సై అన్నట్లుగా క్రీజ్‌లో కాలుదువ్వుతూ కనిపిస్తాడు. క్రికెట్‌ పరంగా భారత్‌-పాక్‌ల మధ్య ప్రత్యేక అనుబంధముందని, పాక్‌ జట్టులోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని రోహిత్‌ ఈ ప్రోమోలో ప్రస్తావిస్తాడు. భారత్‌ ఎనిమిదో సారి ఆసియా కప్‌ గెలవాలి, విశ్వవేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడాలంటూ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 

స్టార్‌ స్పోర్ట్స్‌ కొద్ది రోజుల ముందు కూడా రోహిత్‌ను హైలైట్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో హిట్‌మ్యాన్‌.. 140 కోట్ల మంది భారత అభిమానులు ‘‘ఇండియా.. ఇండియా’’ అని ముక్తకంఠంతో నినదిస్తుంటే వినడం కంటే గొప్ప అనుభూతి ఉండదని, ఆసియా కప్‌లో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడిద్దాం రమ్మని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా విండీస్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.  
చదవండి: రోహిత్‌కు రెస్ట్‌.. కెప్టెన్‌గా హార్ధిక్‌.. మరో కొత్త ఓపెనింగ్‌ జోడీతో ప్రయోగం

Videos

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

Photos

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)