Breaking News

తొలి టి20.. భారత్‌ ముంగిట అరుదైన రికార్డు; పాక్‌ మనకంటే ముందే?

Published on Thu, 08/03/2023 - 15:50

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకుంది. టెస్టు సిరీస్‌ను 1-0తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20 సిరీస్‌పై కన్నేసింది. రోహిత్‌ శర్మ, కోహ్లి, జడేజాలు ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తొలి టి20లో తలపడనుంది.

ఐపీఎల్‌లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్‌, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌లు విండీస్‌తో టి20 సిరీస్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే జైశ్వాల్‌ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్‌ సెంచరీతో రాణించి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇక గిల్‌, ఇషాన్‌ కిషన్‌లు వన్డే సిరీస్‌లో అద్బుతంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్‌ కిషన్‌ హ్యాట్రిక్‌ అర్థసెంచరీలతో మెరిశాడు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఫినిషర్స్‌గా సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యాలు తమ వంతు పాత్ర పోషించనున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్‌ ద్వారా ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు 200వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. టి20 క్రికెట్‌ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఇంతకముందు పాకిస్తాన్‌ మాత్రమే ఈ మార్క్‌ను దాటింది.

ఓవరాల్‌గా పాకిస్తాన్‌ 223 టి20 మ్యాచ్‌లు ఆడింది. దీంతో తొలి టి20 మొదలవ్వగానే ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఈ రికార్డును అందుకోనుండడం విశేషం. కాగా ఇప్పటివరకు 199 టి20 మ్యాచ్‌లాడిన టీమిండియా 127 విజయాలు, 63 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్‌ మాత్రం టైగా ముగిసింది.

చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్‌ అయ్యాడో కానీ అంతా శుభమే..

Ishan- Gill: వెటరన్‌ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్‌- గిల్‌! 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)