Breaking News

టీ20 సిరీస్‌.. జింబాబ్వేకు బ‌య‌ల్దేరి వెళ్లిన టీమిండియా

Published on Sun, 07/19/2026 - 07:26

జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా శ‌నివారం రాత్రి భార‌త్ నుంచి బ‌య‌ల్దేరి వెళ్లింది. ఈ సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినివ్వ‌డంతో అత‌డి స్థానంలో జ‌ట్టు మెంటార్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ స‌హా తిల‌క్ వ‌ర్మ‌, వైభ‌వ్ సూర్య‌వంశీ, అభిషేక్ శ‌ర్మ ఇత‌ర క్రికెట‌ర్లు జింబాబ్వే టూర్‌కు వెళ్తున్న ఫొటోల‌ను బీసీసీఐ పంచుకుంది. 

ఇంగ్లండ్ టూర్‌లో ఇవాళ చివ‌రి వ‌న్డే ఆడిన అనంత‌రం టీ20 కెప్టెన్‌ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌, శివ‌మ్ దూబేలు నేరుగా జింబాబ్వేకు ప‌య‌నం కానున్నారు. సూర్యకుమార్ యాద‌వ్ స్థానంలో టీ20 కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా.. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ల‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌ల్లో ఓట‌మిపాలైంది. 

త‌న కెప్టెన్సీలో శ్రేయ‌స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవ‌క‌పోవ‌డంతో జింబాబ్వే సిరీస్ అత‌డికి కీల‌కం కానుంది. జింబాబ్వే టూర్‌లో టీమిండియానే ఫెవ‌రెట్‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ఆతిథ్య జ‌ట్టును త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు. ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జూలై 23 నుంచి మొద‌లుకానుంది. తొలి టీ20 జూలై 23న హ‌రారే వేదిక‌గా సాయంత్రం 4.30 గంటలకు జ‌ర‌గ‌నుంది. 2024 జూలైలో చివ‌ర‌గా జింబాబ్వేలో ప‌ర్య‌టించిన భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకుంది.

ఇక ఈ సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పక్కకు తప్పించారు. రింకూ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌లతో పాటు ప్రబ్‌సిమ్రన్‌లను జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేసింది.

జింబాబ్వే టూర్‌కు టీమిండియా:  శ్రేయ‌స్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యాష్ ఠాకూర్‌, అశోక్‌ శర్మ, ప్రబ్‌సిమ్ర‌న్‌, మ‌యాంక్ యాద‌వ్‌.

చదవండి: రిటైర్మెంట్ ఊహాగానాల‌పై రోహిత్ తొలి స్పంద‌న‌!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)