రెచ్చిపోయిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన న్యూజిలాండ్‌

Published on Sun, 01/25/2026 - 20:45

గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని 153 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. 

ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం బుమ్రా మహోగ్రరూపం దాల్చాడు. తన కోటా 4 ఓవర్లలో ​కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీటిలో టిమ్‌ సీఫర్ట్‌, కైల్‌ జేమీసన్‌ వికెట్లు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిని బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

క్లీన్‌ బౌల్డ్‌ అంటే ఏదో సాదాసీదా కాదు. బుమ్రా బౌలింగ్‌ వేగానికి వికెట్లు గాల్లో నాట్యం చేశాయి. మరో బౌలర్‌ రవి బిష్ణోయ్‌ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, బిష్ణోయ్‌.. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తికి ప్రత్యామ్నాంగా వచ్చి చెలరేగడం విశేషం.

న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో మరో ఇద్దరు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషించారు. హర్షిత్‌ రాణా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన డెవాన్‌ కాన్వే వికెట్‌ తీయగా.. హార్దిక్‌ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 

మిగతా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (3-0-32-0), శివమ్‌ దూబే (2-0-24-0) వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27), డారిల్‌ మిచెల్‌ (14), సీఫర్ట్‌ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్‌ (4), జేమీసన్‌ (3), హెన్రీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

 

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)