Breaking News

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌.. భారత జట్టు ప్రకటన

Published on Thu, 02/29/2024 - 14:56

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే చివరాఖరి (ఐదు) టెస్ట్‌ కోసం అప్‌డేట్‌ చేసిన భారత్‌ జట్టును ఇవాళ (ఫిబ్రవరి 29) ప్రకటించారు. నాలుగో టెస్ట్‌కు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడంటే తుది జట్టులో అతని స్థానం ఖరారైనట్లే.

బుమ్రా.. ఆకాశ్‌దీప్‌తో కలిసి భారత పేస్‌ బౌలింగ్‌ దళాన్ని లీడ్‌ చేస్తాడు. బుమ్రా పునరాగమనంతో నాలుగో టెస్ట్‌లో ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయిన సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. ధర్మశాల పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం లేదు. 

భారత తుది జట్టు విషయానికొస్తే.. నాలుగో టెస్ట్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. వరుసగా మూడు టెస్ట్‌ల్లో విఫలమైన రజత్‌ పాటిదార్‌ స్థానంలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ తుది జట్టులోకి రావచ్చు. సిరాజ్‌ ప్లేస్‌లో బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైపోయింది. ఐదో టెస్ట్‌లో రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చి, అశ్విన్‌కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది.

ధర్మశాల టెస్ట్‌ అశ్విన్‌కు 100వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో ఇది నిజమేనని  అంతా అనుకున్నారు. అయితే ఈ ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. రోహిత్‌ అప్‌డేట్‌ చేసిన జట్టులో ఉన్నాడంటే తుది జట్టులో ఉన్నట్లే. మొత్తంగా చూస్తే బుమ్రా రీఎంట్రీ మినహా ఐదో టెస్ట్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

ఐదో టెస్ట్‌ కోసం అప్‌డేట్‌ చేసిన భారత జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), కేఎస్ భరత్ (వికెట్‌కీపర్‌), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మొమమ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ 

ఐదో టెస్ట్‌లో భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శస్వి జైస్వాల్, శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ఆకాష్ దీప్    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)