Breaking News

బుమ్రా బౌలింగ్‌లో మా వాడు 6 సిక్స్‌లు కొడతాడు: పాక్‌ ప్లేయర్‌

Published on Fri, 09/12/2025 - 15:33

ఆసియాక‌ప్‌-2025లో భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు స‌మ‌యం అస‌న్న‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ 14న దుబాయ్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు త‌మ ఆస్త్ర‌శాస్త్రాల‌ను సిద్దం చేసుకున్నాయి. భార‌త్ ఇప్ప‌టికే త‌మ తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేయ‌గా.. పాక్ జ‌ట్టు వారి మొద‌టి మ్యాచ్‌లో శుక్ర‌వారం ఒమ‌న్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

పాకిస్తాన్ కూడా వారి తొలి మ్యాచ్‌లో సునాయ‌సంగా విజ‌యం సాధించే అవ‌కాశ‌ముంది. కానీ అస‌లు సిస‌లైన సవాల్ ఆదివారం ఎదురుకానుంది. ఆసియాక‌ప్‌లో పాక్‌పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మ‌రోసారి దాయాదిపై త‌మ జోరును కొన‌సాగించాలని సూర్య‌కుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది.

ప్ర‌త్య‌ర్ధి పాక్ సైతం ఎలాగైనా టీమిండియాను ఓడించాల‌ని ప‌ట్టుద‌లతో ఉంది. ఈ బ్లాక్ బ్లాస్ట‌ర్ మ్యాచ్ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ తన్వీర్ అహ్మద్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. టీమిండియా సూప‌ర్ స్టార్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పాక్ య‌వ ఓపెన‌ర్ సైమ్ అయూబ్ వ‌రుస‌గా ఆరు సిక్స్‌లు కొడ‌తాడ‌ని త‌న్వీర్ బిల్డ‌ప్ ఇచ్చాడు. 

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న్వీర్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో భార‌త అభిమానులు త‌న్వీర్‌కు కౌంట‌రిస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ క‌నీసం ఫోర్ అయినా కొడ‌తాడా? అని ఫ్యాన్స్ సెటైర్‌లు వేస్తున్నారు. కాగా ప్ర‌పంచ క్రికెట్‌లో బుమ్రా నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. 

స్మిత్‌, రూట్‌, స్టోక్స్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బ్యాట‌ర్లు సైతం బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది ప‌డ్డారు. అటువంటిది ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అంటే అది క‌ల‌లో కూడా జ‌ర‌గ‌దు. అయితే పాక్ జ‌ట్టులో అయూబ్ గ‌త కొంత‌కాలంగా నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. 41 టీ20ల్లో 816 ప‌రుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అయూబ్ చేయ‌గ‌ల‌డు.
చదవండి: మా జట్టుకు మాత్రం.. గిల్‌ ఇలా ఆడడు: గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)