Breaking News

T20 World Cup 2026: నమీబియాపై టీమిండియా ఘన విజయం

Published on Thu, 02/12/2026 - 22:29

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో నేడు (ఫిబ్రవరి 12) జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్‌గా నిలిచింది. దీంతో 93 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది.

నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్‌క్యాంప్ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జాన్ ఫ్రైలింక్ 22 పరుగులు సాధించాడు. మిగితా బ్యాట్స్‌మెన్స్‌ తక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో  నమీబియా జట్టు 116 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది.

భారత బౌలర్లలో వరుణ్ చకరవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు తలో వికెట్టు దక్కింది. బ్యాటింగ్‌లో 52 పరుగులతో రాణించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీయడంతో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

తొలుత టాస్‌ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. 

తుది జట్లు..
భారత్‌: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)