Breaking News

ప్రధాని మోదీని కలువనున్న టీ20 ఛాంపియన్స్‌.. ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగింపు

Published on Wed, 07/03/2024 - 10:59

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత భారత్‌ జట్టు పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2007) టీమిండియా టైటిల్‌ను సాధించింది. అనంతరం 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ ఏడాది భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ప్రతిసారి భారత్‌లో సంబురాలు అంబరాన్నంటుతాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేట్‌ చేసుకోవాలని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా సహకరించనుందని తెలుస్తుంది.

వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. మోదీ భారత బృందం మొత్తాన్ని సన్మానించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ప్రభుత్వం ఆథ్వర్యంలోనే భారత ఆటగాళ్లను ముంబై నగర వీధుల్లో ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా ఐసీసీ టోర్నీలు, ముఖ్యంగా వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు ఓపెన్‌ టాప్‌ బస్‌ల్లో ఊరేగించారు. ఈసారి కూడా అలాగే చేయాలని భారత ప్రభుత్వం బీసీసీఐని ఆదేశించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో విజయబావుటా ఎగరవేసిన టీమిండియా ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. భారత క్రికెటర్లు హరికేన్‌ (గాలివాన) కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో ఇరుక్కుపోయారు. భారత బృందం రేపు ఉదయం కల్లా స్వదేశానికి చేరే అవకాశం ఉంది. టీమిండియా ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారత బృందం ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో బార్బడోస్‌ నుంచి బయల్దేరనుంది.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)