ప్రధాని మోదీని కలవనున్న విశ్వ విజేతలు.. అనంతరం ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్ర

Published on Thu, 07/04/2024 - 07:29

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్‌ 29న జరిగిన ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్‌ ట్రోఫీ) సాధించింది.

కాగా, వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత బృందం ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే చిక్కుకుపోయింది. బార్బడోస్‌లో హరికేన్‌ (గాలివాన) బీభత్సం కారణంగా  టీమిండియా రెండు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. హరికేన్‌ ప్రభావం కారణంగా బార్బడోస్‌ విమానాశ్రయం మూసివేయడంతో టీమిండియా స్వదేశానికి చేరడం ఆలస్యమైంది.

ఎట్టకేలకు 100 మందితో కూడిన భారత బృందం ఇవాళ (జులై 4) తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్‌ అయ్యింది. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం​ టీమిండియాను ఢిల్లీకి చేర్చింది.

మోదీని కలువనున్న భారత బృందం
భారత బృందం ఇవాళ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలువనుంది. ఈ సందర్భంగా మోదీ టీమిండియాను అభినందిస్తారు. మోదీ రెండు బ్యాచ్‌లుగా భారత బృందాన్ని కలుస్తారు. తొలుత ఆటగాళ్లు, ఆతర్వాత సపోర్టింగ్‌ స్టాఫ్‌ మోదీతో ములాఖాత్‌ అవుతారు. ఉదయం 9:30 గంటల​ ప్రాంతంలో భారత బృందం మోదీని కలిసే అవకాశం ఉంది.

ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్ర
అనంతరం టీమిండియా ‍ప్రత్యేక విమానంలో ముంబైకు బయల్దేరుతుంది. సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం  వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)