Breaking News

T20 World Cup 2024: రసవత్తరంగా మారిన గ్రూప్‌-1 రెండో సెమీస్‌ బెర్త్‌ రేసు

Published on Tue, 06/25/2024 - 07:26

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో గ్రూప్‌-1 నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్‌ నుంచి టీమిండియా తొలి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా (ఆసీస్‌పై విజయంతో).. రెండో బెర్త్‌ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టీమిండియా చేతిలో ఆసీస్‌ ఓటమితో గ్రూప్‌-1 నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఖాతాల్లో చెరి 2 పాయింట్లు ఉండగా.. బంగ్లాదేశ్‌ ఖాతా పాయింట్లేమీ లేవు.

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో కూడా 2 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆసీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు బంగ్లాదేశ్‌ కూడా సెమీస్‌ రేసులో ఉంటుంది.

ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్‌ 61 పరుగులు అంతకంటే ఎక్కువ తేడాతో గెలిచినా.. 13 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించినా భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది.

ఆఫ్ఘనిస్తాన్‌.. బంగ్లాదేశ్‌ను ఓడిస్తే భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది.

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 61 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది.

ఇదిలా ఉంటే, సెయింట్‌ విన్సెంట్‌ వేదికగా ఇవాళ (జూన్‌ 25) ఉదయం 6 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ​ ఎంచుకుంది. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులుగా ఉంది. గుర్బాజ్‌ (43), ఇబ్రహీం జద్రాన్‌ (18), ఒమర్‌జాయ్‌ (10) ఔట్‌ కాగా.. గుల్బదిన్‌ నైబ్‌ (4), నబీ (1) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ 3, ముస్తాఫిజుర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌ ఫలితంపై గ్రూప్‌-1 రెండో సెమీస్‌ బెర్త్‌ ఆధారపడి ఉంది. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)