Breaking News

T20 World Cup 2024: క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్‌ వార్నర్‌

Published on Thu, 06/06/2024 - 12:35

ఆసీస్‌ వెటరన్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన కెరీర్‌ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్‌ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్‌) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్‌ విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్‌ సెంచరీ కలుపుకుని వార్నర్‌ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు ఉండగా.. గేల్‌ పేరిట 110 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు నమోదై ఉన్నాయి. 

వార్నర్‌ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.

కాగా, బార్బడోస్‌ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. స్టోయినిస్‌ (36 బంతుల్లో 67 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్‌ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్‌ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్‌ (4-0-28-2), స్టార్క్‌ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్‌ ఖాన్‌ ఒమన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)