Breaking News

T20 WC: శ్రీలంకకు షాకిచ్చిన పసికూన!

Published on Tue, 02/03/2026 - 19:06

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహక మ్యాచ్‌లో ఒమన్‌ శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించి లంక-'ఎ' జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న వరల్డ్‌కప్‌ టోర్నీ  ఆరంభంకానున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సోమవారం నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీలంక-'ఎ' జట్టు మంగళవారం ఒమన్‌తో తలపడింది. కొలంబో వేదికగా టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

145 పరుగులకే పరిమితం
అయితే, ఒమన్‌ బౌలర్ల ధాటికి తాళలేక 145 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్‌లో ఓపెనర్‌ సినెత్‌ జయవర్దన (9), వన్‌డౌన్‌ బ్యాటర్‌ పులిందు పెరిరా (9) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ దుల్‌నిత్‌ సిగెర (20) ఫర్వాలేదనిపించాడు.

మిగిలిన వారిలో గుణశేఖర (21), వనుజ సహాన్‌ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 145 పరుగులు చేసింది. ఒమన్‌ బౌలర్లో షా ఫైజల్‌, షకీల్‌ అహ్మద్‌, జే ఒడెరా రెండేసి వికెట్లు పడగొట్టగా.. నదీం ఖాన్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆమీర్‌ కలీమ్‌ ధనాధన్‌ 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. ఓపెనర్‌, 44 ఏళ్ల వెటరన్‌ ప్లేయర్‌ ఆమీర్‌ కలీమ్‌ (47 బంతుల్లో 80) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. 

అతడికి తోడుగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వినాయక్‌ శుక్లా (24 బంతుల్లో 39 నాటౌట్‌) రాణించాడు. మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో వనుజ సహాన్‌ మూడు వికెట్లు కూల్చగా.. కెప్టెన్‌ లాహిరు సమరకూన్‌, కవిజ గమేజ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)