Breaking News

T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు

Published on Wed, 03/04/2026 - 21:20

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ అద్బుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కివీస్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.

చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
కేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్‌ (Marco Jansen) .. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.

సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్‌- స్టబ్స్‌ నిలిచారు.

టీ20 ప్రపంచకప్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్‌ పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేసిన జోడీలు
👉మార్కస్‌ స్టొయినిస్‌- మాథ్యూవేడ్‌ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్‌ మీద 2021 సెమీ ఫైనల్లో 81*
👉మార్కో యాన్సెన్‌- ట్రిస్టన్‌ స్టబ్స్‌ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్‌ మీద 2026 సెమీ ఫైనల్లో 73
👉ఏంజెలో మాథ్యూస్‌- కుమార్‌ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్‌ మీద 2009 ఫైనల్లో 68*
👉జార్జ్‌ బెయిలీ- ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్‌ మీద 2012 సెమీ ఫైనల్లో 68
👉కార్లోస్‌ బ్రాత్‌వైట్‌- మార్లన్‌ సామ్యూల్స్‌ (వెసి​ండీస్‌) ఇంగ్లండ్‌ మీద 2016 ఫైనల్లో 54*
👉మైకేల్‌ హస్సీ- మిచెల్‌ జాన్సన్‌ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్‌ మీద 2010 సెమీ ఫైనల్లో 53*

169 పరుగులు
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో టాస్‌ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్‌ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్‌ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ 34 పరుగులతో రాణించాడు. 

చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)