Breaking News

IND vs PAK: పాపం బంగ్లాదేశ్‌!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

Published on Mon, 02/09/2026 - 08:59

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌తో ఆడేందుకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ముందు పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మూడు షరతులు ఉంచినట్లు సమాచారం. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌ కోసమంటూ.. 
భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్‌ తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఇందులో నిజం లేదంటూ ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ బంగ్లా పంతం వీడకపోవడంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో తమకు తటస్థ వేదికగా శ్రీలంక ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌ కోసమంటూ.. తామూ టోర్నీ ఆడమని పాక్‌ కొత్త నాటకానికి తెరతీసింది.

మరో డ్రామా
అయితే, ఈ విషయంలో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటుందనే భయంతో మాట మార్చి తాము భారత్‌తో మాత్రమే మ్యాచ్‌ ఆడమని మరో డ్రామాకు తెరలేపింది. క్రికెట్‌ ప్రపంచంలో అత్యధిక క్రేజ్‌ ఉన్న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే.. ఐసీసీతో పాటు సభ్య దేశాలు భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. పాక్‌ క్రికెట్‌ బోర్డు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

ఘాటుగా స్పందించిన శ్రీలంక
ఇక ఈ విషయంపై శ్రీలంక సైతం ఘాటుగానే స్పందించింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారత్‌తో మ్యాచ్‌పై పునరాలోచన చేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేసింది. ఇతర సభ్య దేశాల బోర్డులు సైతం పాక్‌ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు ప్రధాన షరతులు
ఈ నేపథ్యంలో మొదటికే మోసం వస్తుందని భావించిన పాక్‌.. పంతం వీడేందుకు సిద్ధపడినా.. మూడు ప్రధాన షరతులతో ఐసీసీని లాక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 

ఎక్కువ డబ్బు కావాలి!
ఐసీసీ నుంచి తమకు అదనంగా నిధులు సమకూర్చాలని కోరింది. ప్రస్తుతం ఐసీసీ రెవెన్యూ నుంచి నుంచి పీసీబీ 5.75 శాతం ఆదాయం పొందుతోంది. మరోవైపు.. ఇందులో బీసీసీఐ వాటా 39 శాతం.  

ఇక భారత్‌తో తమ క్రికెట్‌ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా 2012 నుంచి భారత్‌- పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపో​యిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసియా కప్‌, వరల్డ్‌కప్‌ వంటి టోర్నీలలో మాత్రమే దాయాదులు ముఖాముఖి తలపడుతున్నాయి.

కరచాలనం చేయాలి
అదే విధంగా.. టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమ జట్టుతో కరచాలనం చేయాలని పీసీబీ ఐసీసీకి కండిషన్‌ పెట్టినట్లు సమాచారం. కాగా పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్‌లో పాక్‌ ఆటగాళ్లతో టీమిండియా షేక్‌హ్యాండ్‌కు నిరాకరించిన విషయం తెలిసిందే.

పాక్‌ బుద్ధి చూపించిందంటూ ట్రోల్స్‌!
ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే తాము టీమిండియాతో మ్యాచ్‌ ఆడతామని పీసీబీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారగా.. ‘‘పాక్‌ బుద్ధి చూపించింది. డబ్బు కోసం బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోంది. నిజంగా బంగ్లాపై అంత ప్రేమ ఉంటే టోర్నీ నుంచి వైదొలగాల్సింది.

అలా కాకుండా తటస్థ వేదిక ఏర్పాటు చేసినా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి.. క్యాష్‌ చేసుకోవాలని చూస్తోంది. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదు’’ అని టీమిండియా అభిమానులు పీసీబీ తీరుపై మండిపడుతున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌ మొదలైన సంగతి తెలిసిందే.

వద్దు.. అలా చేయొద్దు
అయితే, పాక్‌ మీడియా డాన్‌ కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌కు పరిహారం చెల్లించాలని పాక్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. మొత్తం ఆదాయంలో మాత్రం బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిన వాటా ఇస్తామని తెలిపినట్లు సమాచారం. అంతేకాదు.. పాక్‌ బోర్డు భారత్‌తో మ్యాచ్‌ విషయంలో పునరాలోచన చేయాలని.. ఇలా బహిష్కరిస్తామని చెప్పడం క్రికెట్‌కు ఎంతమాత్రం సరికాదని గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.

చదవండి: చరిత్ర సృష్టించిన నేపాల్‌ బౌలర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)