రూథర్‌ఫోర్డ్‌ వీరంగం​.. హోల్డర్‌ మెరుపులు.. విండీస్‌ భారీ స్కోర్‌

Published on Wed, 02/11/2026 - 21:28

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్‌లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు​ చెలరేగడంతో విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (1), షాయ్‌ హోప్‌ (0) వికెట్లు కోల్పోయిన విండీస్‌ను షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (23), రోస్టన్‌ ఛేజ్‌ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్‌ఫోర్డ్‌ (76 నాటౌట్‌), హోల్డర్‌ (33) చెలరేగి ఆడి విండీస్‌కు భారీ స్కోర్‌ అందించారు. 

వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం​ సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్‌ను 200 దరికి చేర్చారు. రూథర్‌ఫోర్డ్‌ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్‌ 17 బంతుల్లో ఓ ఫోర్‌, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ 14, రొమారియో షెపర్డ్‌ ఒక్క పరుగు (నాటౌట్‌) చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ (4-0-16-2) అత్యంత​ పొదుపుగా బౌలింగ్‌ చేసి విండీస్‌ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్‌ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్‌ వికెట్‌ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 

గత మ్యాచ్‌లో సత్తా చాటిన సామ్‌ కర్రన్‌ (3-0-36-1) ఈ మ్యాచ్‌లో  పెద్దగా ‍ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్‌ 2 ఓవర్లలో 32, డాసన్‌ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్‌ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్‌ బేతెల్‌ (20) వేగంగా ఆడుతున్నాడు. 

6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)