Breaking News

టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!

Published on Mon, 03/02/2026 - 21:04

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

కాగా, ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్‌ ప్రతి భారత క్రికెట్‌ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్‌లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ కీలక దశలో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఓ క్యాచ్‌ను తిలక్‌ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్‌, తిలక్‌పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్‌ను తప్పించుకున్నారు.

విండీస్‌తో మ్యాచ్‌ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్‌ అత్యంత చెత్తగా ఉంది. సూపర్‌-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్‌ ప్రదర్శనలు  మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం​ 71 శాతం క్యాచ్‌లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్‌-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్‌ ఫీల్డింగ్‌ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.

సెమీస్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం​ చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్‌ ఫైనల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచే​ భారత్‌ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. 

క్యాచ్‌లు నేలపాలు చేసినా, మిస్‌ ఫీల్డింగ్‌ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్‌ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్‌ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)