Breaking News

ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న న్యూజిలాండ్‌ చిచ్చరపిడుగులు

Published on Thu, 03/05/2026 - 11:07

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, ఆ జట్టు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు ఇప్పటినుంచే ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ సీజన్‌ మినీ వేలంలో కేకేఆర్‌ ఫ్రాంచైజీ టిమ్‌ సీఫర్ట్‌ (రూ. 1.5 కోట్లు), ఫిన్‌ అల్లెన్‌ (రూ. 2 కోట్లు)ను రూ. 3.5 కోట్లకు సొంతం చేసుకుంది. 

ఈ న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ ద్వయం నిన్న (మార్చి 4) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై పేట్రేగిపోయింది. ముఖ్యంగా అల్లెన్‌ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (100 నాటౌట్‌) బాది తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. 

మరో ఎండ్‌లో సీఫర్ట్‌ తానేమీ తక్కువ కాదు అన్నట్లు 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి గెలుపుకు గట్టి పునాది వేశాడు. అల్లెన్‌, సీఫర్ట్‌ ఇంతలా విరుచుకుపడింది తమ ఐపీఎల్‌ హోం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డన్స్‌లో కావడం​ విశేషం. 

అల్లెన్‌, సీఫర్ట్‌ విధ్వంసకాండ చూశాక కేకేఆర్‌ అభిమానుల్లో ఎక్కడలేని జోష్‌ వచ్చింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనలతో చివరి స్థానాల్లో నిలిచిన కేకేఆర్‌కు అల్లెన్‌, సీఫర్ట్‌ కొత్త ఊపునిచ్చారు. వీరిద్దరిని కేకేఆర్‌ వచ్చే సీజన్‌లో ఓపెనర్లుగా ప్రవేశపెట్టవచ్చు. వీరు మెరుపు విన్యాసాలకు పెట్టింది పేరు. ఇదే జోరును వీరు రానున్న ఐపీఎల్‌ సీజన్‌లోనూ కొనసాగిస్తే.. కేకేఆర్‌ మరోసారి టైటిల్‌ ఎగరేసుకుపోవడం​ ఖాయం. 

దీనికంటే ముందు ఈ ఇద్దరిపై మరో పెద్ద బాధ్యత ఉంది. న్యూజిలాండ్‌ను రెండో సారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేర్చిన వీరు.. ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలని కసిగా ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో వీరిద్దరి ఫామ్‌ అమోఘంగా ఉంది. ఇప్పటికే 463 పరుగులు జోడించి, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగులు జోడిగా రికార్డు నెలకొల్పారు. 

తాజాగా సౌతాఫ్రికాపై తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అల్లెన్‌-సీఫర్ట్‌ జోడి.. ఈ ఎడిషన్లో 100 ప్లస్‌ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది రెండోసారి. గ్రూప్‌ దశలో యూఏఈపై ఈ జోడీ అజేయమైన 175 పరుగులు జోడించి ప్రపంచకప్‌ రికార్డు నెలకొల్పింది. 

మొత్తంగా అల్లెన్‌-సీఫర్ట్‌ జోడీ అటు స్వదేశ అభిమానులతో పాటు కేకేఆర్‌ అభిమానుల్లోనూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుంది. ఈ జోడీ ప్రపంచకప్‌ ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ (మార్చి 5) భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో న్యూజిలాండ్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్‌ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది.

 

 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)