Breaking News

భారత్‌ చేతిలో ఓడినా.. చరిత్ర సృష్టించిన పాక్‌

Published on Mon, 02/16/2026 - 14:07

టీమిండియా చేతిలో ఓడినా పాకిస్తాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో రెండుసార్లు 18 ఓవర్లపాటు స్పిన్‌ బౌలింగ్‌నే ప్రయోగించిన తొలి జట్టుగా నిలిచింది.

స్పిన్‌ దళంపైనే నమ్మకం
టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌ ఆదివారం టీమిండియాతో తలపడిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న పాక్‌.. తమ స్పిన్‌ దళంపైనే ఎక్కువగా ఆధారపడింది. స్పెషలిస్టు స్పిన్నర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌ మూడు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఇక బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు సల్మాన్‌ ఆఘా రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీయగా.. నాలుగు ఓవర్ల కోటాలో సయీమ్‌ ఆయుబ్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు షాదాబ్‌ ఖాన్‌ ఒక ఓవర్‌ వేసి 17 రన్స్‌, మొహమ్మద్‌ నవాజ్‌ 4 ఓవర్లలో 28 రన్స్‌ ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

షాహిన్‌ ఆఫ్రిది విఫలం
ఇలా నిర్ణీత 20 ఓవర్లలో 18 ఓవర్లు పాక్‌ స్పిన్నర్లే వేయగా.. ఏకైక పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది రెండు ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కాగా పాక్‌ ఇలా స్పిన్‌ దళాన్నే నమ్ముకోవడం ఇదే తొలిసారి కాదు. 2012 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా మీద కూడా ఇదే తరహాలో ఇదే వేదికపై స్పిన్‌ అస్త్రాన్ని ప్రయోగించింది పాక్‌.

తద్వారా పొట్టి వరల్డ్‌కప్‌ ఈవెంట్లో అత్యధికంగా రెండుసార్లు 18 ఓవర్లు స్పిన్‌ వేయించిన తొలి జట్టు పాకిస్తాన్‌ నిలిచింది. కాగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.

టీమిండియా ఇలా
ఈ మ్యాచ్‌లో పాక్‌ ప్రధానంగా స్పిన్‌ను నమ్ముకుంటే.. టీమిండియా పేసర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత పేసర్లలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మూడు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.

ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌ యాదవ్‌ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్‌ పడగొట్టగా.. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు తిలక్‌ వర్మ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీయగా.. రింకూ సింగ్‌ ఒక ఓవర్లో 9 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాకిస్తాన్‌ యూఎస్‌ఏతో మ్యాచ్‌లో కూడా ఏకంగా 16 ఓవర్లు స్పిన్‌ బౌలింగ్‌ వేయించడం గమనార్హం.

చదవండి: అభిషేక్‌ శర్మ ఫెయిల్‌.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)