Breaking News

T20 WC 2026: కొనసాగుతున్న అభిషేక్‌ శర్మ చెత్త ప్రదర్శన

Published on Wed, 02/18/2026 - 19:38

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ చెత్త ఫామ్‌ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తానాడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, పాకిస్తాన్‌) డకౌట్లైన అభిషేక్‌.. ఇవాళ (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్‌ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.

ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అయిన అభిషేక్‌ తన తొలి టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడినా ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అభిషేక్‌కు చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఇది ఐదో డకౌట్‌ కావడం మరింత శోచనీయం.

ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను జెర్సీ మార్పు కూడా కాపాడలేకపోయిం​ది. అభిషేక్‌ తన రెగ్యులర్‌ జెర్సీ కాకుండా సిరాజ్‌ వేసుకునే 73వ నంబర్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగినా ఖాతా తెరవలేకపోయాడు.

తాజా డకౌట్‌ తర్వాత అభిషేక్‌ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్‌ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ కష్టాల్లో ఉంది. పవర్‌ ప్లేలోనే (తొలి 6 ఓవర్లలో) ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (0), ఇషాన్‌ కిషన్‌ (18) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. 6 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 51-2గా ఉంది. తిలక్‌ వర్మ (26), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు స్పిన్నర్‌ ఆర్మన్‌ దత్‌కే దక్కాయి. అభిషేక్‌, ఇషాన్‌లను దత్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడం​ విశేషం.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు