Breaking News

PAK vs USA: అమెరికా పేసర్‌ అరుదైన ఘనత

Published on Wed, 02/11/2026 - 08:45

అంతర్జాతీయ క్రికెట్‌లో సీనియర్‌ స్థాయిలో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో పేస్‌ బౌలర్‌ ఎహ్‌సాన్‌ ఆదిల్‌ కూడా చేరాడు. 32 ఏళ్ల ఆదిల్‌ 2013లో అరంగేట్రం చేసి పాకిస్తాన్‌ తరఫున 3 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు. 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా అతడు రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగాడు. 

సొంత దేశంపైనే అరంగేట్రం
అయితే ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిన అతను అక్కడ తన క్రికెట్‌ను కొనసాగించి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాదు అమెరికా టీ20 వరల్డ్‌ కప్‌-2026 జట్టులో చోటు దక్కించుకున్న ఆదిల్‌కు.. పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచే అమెరికా తరపున తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. ఇలా తన సొంత దేశం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనే అమెరికా తరఫున అతడు అరంగేట్రం చేయడం విశేషం. 

ప్రతీకారం తీర్చుకున్న పాక్‌
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. కొలంబోలో టాస్‌ గెలిచిన అమెరికా పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

అయితే, లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 32 పరుగుల తేడాతో గెలిచిన పాక్‌.. గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అమెరికా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.  ఈ మ్యాచ్‌లో ఆదిల్‌ 3 ఓవర్లలో 39 పరుగులిచ్చాడు. 

ప్రపంచకప్‌ నుంచి హసరంగ, బ్రేస్‌వెల్‌ అవుట్‌ 
తాజా టీ20 ప్రపంచకప్‌లో దాదాపు అన్ని జట్లను గాయాల బెడద వేధిస్తోంది. తాజాగా శ్రీలంక, న్యూజిలాండ్‌లకు చెందిన హసరంగ, మైకేల్‌ బ్రేస్‌వెల్‌ మెగా ఈవెంట్‌కు దూరమయ్యారు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్‌ హసరంగ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. 

దీంతో వరల్డ్‌కప్‌లో కొనసాగే అవకాశం లేకపోవడంతో అతని స్థానాన్ని లెగ్‌ స్పిన్నర్‌ హేమంతతో భర్తీ చేసుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. బ్రేస్‌వెల్‌ భారత పర్యటనకు వచ్చినపుడే గాయపడ్డాడు. అయితే వార్మప్‌ మ్యాచ్‌ సమయంలో అతని గాయం తిరగబెట్టింది. దీంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్‌ కోల్‌ మెక్‌కొంచిని తీసుకున్నారు.    

చదవండి: T20 WC 2026: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్‌

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)