Breaking News

ఆసీస్‌పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్‌ సెంచరీ

Published on Fri, 02/13/2026 - 16:12

టీ20 ప్రపంచకప్‌ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్‌ బౌలర్‌‌ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో  కీలక ఆటగాళ్లు జోష్‌ ఇంగ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌, మ్యాట్‌ రెన్‌షా, ఆడమ్‌ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్‌ వేరియేషన్స్‌తో పట్టిష్టమైన ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్‌లో తన చివరి వికెట్‌తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా, ఓవరాల్‌గా 35 బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు).  

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్‌), మరుమణి (35), ర్యాన్‌ బర్ల్‌ (35), సికందర్‌ రజా (25 నాటౌట్‌) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్‌ బర్ల్‌ (1-0-9-1), గ్రేమీ క్రీమర్‌ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్‌ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్‌ రెన్‌షా (65), మ్యాక్స్‌వెల్‌ (31) విఫలయత్నం చేశారు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)