Breaking News

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన రింకూ సింగ్‌

Published on Fri, 08/30/2024 - 11:29

యూపీ టీ20 లీగ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు రింకూ సింగ్‌ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతను.. మూడింటిలో అజేయంగా (7  నాటౌట్‌ (2), 48 నాటౌట్‌ (35), 64 నాటౌట్‌ (35)) నిలిచి 119 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో మీరట్‌ మెవెరిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న రింకూ.. తాజాగా నోయిడా సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మెవెరిక్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెవెరిక్స్‌ ఇన్నింగ్స్‌లో రింకూతో పాటు మాధవ్‌ కౌశిక్‌ (40) రాణించాడు. నోయిడా బౌలర్లలో నమన్‌ తివారి, కునాల్‌ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పియూశ్‌ చావ్లా, కార్తికేయ యాదవ్‌, నితీశ్‌ రాణా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నోయిడా.. నిర్ణీత ఓవర్లలో 152 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కావ్య టియోటియా (65) నోయిడాను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆదిత్య శర్మ (8 బంతుల్లో 21) బ్యాట్‌ ఝులిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. నోయిడా కెప్టెన్‌ నితీశ్‌ రాణా ఓ మోస్తరు స్కోర్‌ (21) చేశాడు. మెవెరిక్స్‌ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

బంతితోనూ రాణించిన రింకూ..
బ్యాట్‌తో ఇరగదీసిన రింకూ సింగ్‌ బౌలింగ్‌లోనూ (2/18) సత్తా చాటాడు. విశాల్‌ చౌదరీ, యశ్‌ గార్గ్‌, జీషన్‌ అన్సారీ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)