Breaking News

రోహిత్ శ‌ర్మ భార్య రితిక స‌ల‌హా.. అలా చేశా..

Published on Tue, 09/30/2025 - 15:19

హిట్‌మాన్ రోహిత్ శ‌ర్మ భార్య రితికా సజ్దేహ్ స‌ల‌హా పాటించానంటున్నాడు టీమిండియా టి20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ (Suryakumar Yadav). ఆ స‌ల‌హా పాటించ‌డం వ‌ల‌న త‌న‌కు మంచే జ‌రిగిందంటున్నాడు స్కై. ఇంత‌కీ ఏ విష‌యంలో ఆమె స‌ల‌హా పాటించాడో తెలుసా?

చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌పై ఉత్కంఠ‌పోరులో గెలిచి ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) కైవ‌సం చేసుకోవ‌డంతో మెన్ ఇన్ బ్లూ పిచ్చ హ్యాపీ మూడ్‌లో ఉంది. సిరీస్ ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు స‌మిష్టిగా రాణించి క‌ప్ అందుకోవ‌డంతో బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ కూడా సూర్య సేన‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ జ‌ట్టును విజేత‌గా నిల‌ప‌డంలో స‌క్సెస్ అయ్యాడు సూర్య‌. ప‌దునైన వ్యూహాల‌తో మైదానంలో జ‌ట్టును ముందుండి న‌డిపించి విజ‌య‌ప‌థంలో నిలిపాడు. హ్యాండ్‌షేక్ లేని సంఘటన నుంచి చివరి రోజు ట్రోఫీ లేని వేడుకల వరకు వరుస వివాదాలు న‌డుమ కూల్‌గా నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. పాకిస్థాన్ జ‌ట్టుతో వ్య‌వ‌హ‌రించిన తీరుతో టీమిండియా అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

అదే ఫాలో అవుతున్నా
తాను కూల్‌గా ఉండ‌టానికి రోహిత్ శ‌ర్మ వైఫ్ రితిక ఇచ్చిన స‌ల‌హా ఉప‌యోగ‌ప‌డింద‌ని సూర్య‌కుమార్ వెల్ల‌డించాడు. ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌తో అత‌డు మాట్లాడుతూ.. మేజ‌ర్ టోర్న‌మెంట్లు ఆడ‌టానికి ముందు రోహిత్ శ‌ర్మ సోష‌ల్ మీడియాకు (Social Media) దూరంగా ఉంటాడ‌ని రితిక చెప్పింద‌ని తెలిపాడు. తాను కూడా అదే ఫాలో అవుతున్నాన‌ని చెప్పాడు. ఆసియాక‌ప్ ఆడ‌టానికి ముందు త‌న ఫోన్‌లోని సోష‌ల్ మీడియా యాప్స్ అన్ని తొల‌గించిన‌ట్టు రివీల్ చేశాడు. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌డంతో ప్ర‌శాంతత ల‌భించ‌డంతో పాటు డెసిష‌న్ మేకింగ్ ఇంప్రూవ్ అయింద‌న్నాడు.

ఆ యాప్స్ తీసేశా
'ఆసియాక‌ప్‌ ఆడేందుకు దుబాయ్ రావ‌డానికి ముందు నా ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రామ్, ట్విట‌ర్, ఫేస్‌బుక్ యాప్స్ డిలీట్ చేశాను. క‌మ్యూనికేష‌న్ కోసం వాట్సాప్ ఒక‌టే ఉంచాను. మ‌న ఫోన్‌లో సోష‌ల్ మీడియా యాప్స్ ఉంటే అందులో వ‌చ్చే మెసేజ్‌లు అన్ని చూడాల‌నిపిస్తుంటుంది. మెగా టోర్న‌మెంట్‌లు ఆడ‌టానికి ముందు రోహిత్ శ‌ర్మ (Rohit Sharma)  సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటాడ‌ని రితిక చెప్పిన విష‌యం నాకు బాగా గుర్తుంది. రోహిత్ త‌న ఫోన్‌లోని యాప్స్ తొల‌గిస్తాడ‌ని ఆమె చెప్పింది. దీన్ని నేను కూడా ఫాలో అవుతున్నాడు. దీనివ‌ల్ల నాకు మంచే జ‌రిగింద‌'ని సూర్య‌కుమార్ చెప్పాడు. 

చ‌ద‌వండి: మా ఆట‌గాళ్లంతా ఒక్కో ట్రోఫీతో స‌మానం 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)