Breaking News

కుల్దీప్‌ను అంత మాటన్నాడా? ‘చెత్త’ వాగుడు కట్టిపెట్టు సూర్య.. ఇదేం పద్ధతి!

Published on Mon, 07/31/2023 - 15:48

Suryakumar Slammed For On Field Comments On Kuldeep: టీ20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 50 ఓవర్ల క్రికెట్‌లో 25 మ్యాచ్‌లు ఆడిన అతడు 476 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 64.

అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక
ఇక శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో నంబర్‌ 4లో బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కించుకున్నాడు సూర్య. అయితే, వెస్టిండీస్‌ పర్యటనలో రెండు వన్డేల్లోనూ అతడు విఫలమయ్యాడు. బార్బడోస్‌ మ్యాచ్‌లలో వరుసగా 19, 24 పరుగులు చేశాడు.

ఈ నేపథ్యంలో స్కై ఏదో మ్యాజిక్‌ చేస్తాడనుకుంటే నిరాశపరుస్తున్నాడంటూ అభిమానులు అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, రెండో వన్డే సందర్భంగా ఆటతో కాకుండా తన ‘అనుచిత’ ప్రవర్తనతో ట్రోలర్స్‌ చేతికి చిక్కాడు సూర్య. ఇంతకీ ఏం జరిగిందంటే..

కుల్దీప్‌ యాదవ్‌ను అలా అనగానే
కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో విండీస్‌తో రెండో వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 181 పరుగులకు ఆలౌట్‌ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు దూకుడుగానే ఆడింది. ముఖ్యంగా కెప్టెన్‌ షాయీ హోప్‌.. హాఫ్‌ సెంచరీతో చెలరేగి జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు.

ఇదిలా ఉంటే.. విండీస్‌ ఇన్నింగ్స్‌ 29వ ఓవర్లో.. విజయానికి 48 పరుగుల దూరంలో ఉన్న సమయంలో.. సూర్యకుమార్‌ యాదవ్‌ కవర్‌ పొజిషిన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. అదే సమయానికి భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన ఏడో ఓవర్‌ వేసేందుకు వచ్చాడు.

నువ్వు మా కచ్రావి
ఈ క్రమంలో కుల్దీప్‌ను ఉద్దేశించి.. ‘‘నువ్వు మా కచ్రావి’’ అంటూ సూర్య కామెంట్‌ చేశాడు. ఇది స్టంప్‌మైక్‌లో రికార్డైంది. ఇందుకు బదులివ్వని కుల్దీప్‌ తన పని తాను చేసుకుపోయాడు. అయితే, టీమిండియా ఫ్యాన్స్‌ మాత్రం సూర్య మాటలను తేలికగా తీసుకోలేకపోయారు.

కుల్దీప్‌ ఈ విధంగా బదులిచ్చేవాడు అంటూ తమదైన శైలిలో సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ముందు మీరేగా పెంట చేసింది. ఇంక నేనేం చేయగలను’’ అని అన్నాడని ఓ యూజర్‌ పేర్కొన్నాడు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ బ్లాక్‌బ్లస్టర్‌ ‘లగాన్‌’లోని కచ్రా(స్పిన్‌ బౌలింగ్‌ చేసే వ్యక్తి)ని ప్రస్తావిస్తూ సూర్య ఈ విధంగా మాట్లాడి ఉంటాడన్న అర్థంలో కుల్దీప్‌ రిప్లే ఇలా ఉంటుందని పేర్కొన్నాడు.

చెత్తలాగే కనిపిస్తాలే!
అయితే, మరో యూజర్‌ మాత్రం.. కచ్రా(హిందీలో చెత్త అని అర్థం) పదాన్ని ఉపయోగించడాన్ని తప్పుబడుతూ.. ‘‘అవును.. నేను హ్యాట్రిక్‌ వికెట్లు తీసినా చెత్తలాగే కనిపిస్తా. అయితే, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మాత్రం నువ్వే అసలైన చెత్తవి’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా లగాన్‌ మూవీలో కచ్రా.. అంటరానితనం పేరిట సామాజికంగా వెలివేయబడిన క్యారెక్టర్‌.

సమాజ దురాగతానికి మూల్యం చెల్లించే పాత్ర..
స్పిన్‌ బౌలింగ్‌ చేసే అతడు బ్రిటిష్‌ జట్టుతో క్రికెట్‌ ఆడే ఆమీర్‌ టీమ్‌లో కష్టమ్మీద చోటు సంపాదించి హ్యాట్రిక్‌ సాధిస్తాడు. అయితే, సూర్య.. ఈ మూవీలోని పాత్రను ఉటంకిస్తూ స్ఫూర్తిని నింపే క్రమంలో ఈ మాటలు అన్నాడని అతడి ఫ్యాన్స్‌ అంటుండగా.. నెటిజన్లు మాత్రం.. ‘‘సూర్య చెత్తవాగుడు ఆపి.. ఆటపై దృష్టి పెట్టకపోతే జట్టులో చోటు గల్లంతవుతుంది’’ అని చురకలు అంటిస్తున్నారు.  ఇదిలా ఉంటే.. కుల్దీప్‌ రెండో వన్డేలో ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! అతడికి కూడా

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)