Breaking News

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. లంక జట్టు ప్రకటన.. 'సిక్సర్‌' వీరుడికి చోటు

Published on Wed, 08/07/2024 - 17:39

ఆగస్ట్‌ 21 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం 18 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 7) ప్రకటించారు. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వ సారథ్యం వహించనుండగా.. కుసల్‌ మెండిస్‌ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డేలో ఆరు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన జెఫ్రీ వాండర్సే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

నిసాల తారక, మిలన్‌ రత్నాయకే కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి ఘనమైన దేశవాలీ ట్రాక్‌ రికార్డు ఉంది. తారక 107 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 257 వికెట్లు.. రత్నాయకే 39 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. తారక, రత్నాయకే.. లహీరు కుమార, విశ్వ ఫెర్నాండో, అషిత ఫెర్నాండో, కసున్‌ రజితలతో కలిసి పేస్‌ విభాగంలో ఉంటారు.

స్పిన్‌ డిపార్ట్‌మెంట్‌లో వాండర్సేతో పాటు ప్రభాత్‌ జయసూర్య, రమేశ్‌ మెండిస్‌ ఉన్నారు. దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్‌లతో లంక బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది.

ఇంగ్లండ్ టెస్టులకు శ్రీలంక జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్‌), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వైస్‌ కెప్టెన్‌), ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, అసిత ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లహిరు కుమార, నిసాల తారక, ప్రభాత్‌ జయసూర్య, రమేష్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకే

ఇంగ్లండ్‌ సిరీస్‌ షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌- ఆగస్ట్‌ 21-25 (ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌)
రెండో టెస్ట్‌- ఆగస్ట్‌ 29-సెప్టెంబర్‌ 2 (లార్డ్స్‌)
మూడో టెస్ట్‌- సెప్టెంబర్‌ 6-10 (కెన్నింగ్‌స్టన్ ఓవల్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)