Breaking News

చేతులేత్తేసిన బ్యాట‌ర్లు.. 149 ప‌రుగుల‌కే సౌత్ జోన్ ఆలౌట్‌

Published on Thu, 09/11/2025 - 15:48

దులీప్‌ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో దుమ్ములేపిన సౌత్ జోన్‌.. తుది పోరులో మాత్రం తడబడుతోంది. బెంగళూరు వేదికగా సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌత్‌ జోన్ 63 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. 

కుమార్ కార్తికేయ, శరన్ష్ జైన్ స్పిన్ వలలలో చిక్కుకుని సౌత్ జోన్ బ్యాటర్లు విలవిల్లాడారు. శరన్ష్ జైన్ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్‌(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. 

మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సౌత్ జోన్ జట్టులో నారయణ్ జగదీశన్, దేవ్‌దత్‌ పడిక్కల్‌ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక కావ‌డంతో దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో భాగం కాలేదు. కాగా సెమీఫైన‌ల్లో జ‌గ‌దీశన్ భారీ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. ప‌డిక్క‌ల్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన సౌత్ జోన్ క‌నీసం బౌలింగ్‌లో నైనా రాణిస్తుందో లేదో వేచి చూడాలి.
చదవండి: Asia Cup 2025: 'అత‌డొక సంచ‌ల‌నం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌ అయ్యాడు'

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)