ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక‌ మెస్సీ వంతు!

Published on Wed, 07/15/2026 - 07:11

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో 16 ఏళ్ల త‌ర్వాత స్పెయిన్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. 2010లో చివ‌రిసారి ఫిఫా ఫైన‌ల్ చేరిన స్పెయిన్ ఆనాడు టోర్నీలో చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు స్పెయిన్‌కు ఫైన‌ల్ ఆడే అవ‌కాశం రావ‌డం విశేషం. ఫ్రాన్స్‌తో సెమీస్‌కు ముందు స్పెయిన్ స్టార్ లామినే య‌మాల్ ఎంబాపెతో పాటు ఆ జ‌ట్టుకు స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. 

'భ‌య‌పడేది మేము కాదు.. వాళ్లే మాకు భ‌య‌ప‌డ‌తారు' అని య‌మాల్ అన్న‌ట్లు ఫ్రాన్స్ కీల‌క సెమీస్‌లో అన‌వ‌స‌ర ఒత్తిడికి లోన‌య్యి స్పెయిన్ చేతిలో ప‌రాజ‌యం చ‌విచూసింది. లామినే య‌మాల్‌.. ఎంబాపెకు చెప్పి మ‌రీ దెబ్బతీశాడు. ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో గోల్ చేయ‌న‌ప్ప‌టికీ య‌మాల్ త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు గోల్ చేయ‌డంలో త‌న వంతు పాత్ర‌ను స‌మ‌ర్థంగా పోషించాడు. 

సోమ‌వారం 19వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న లామినే య‌మాల్‌కు ఫ్రాన్స్‌పై విజ‌యంతో స్పెయిన్‌ను ఫైన‌ల్ చేర్చి త‌న స‌హ‌చ‌రులు అత‌డికి బ‌ర్త్‌డే కానుకగా అందించారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత లామినే య‌మాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 'ఫిఫా వంటి ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ‌క‌ప్‌లో మెస్సీకి ఎదురుప‌డితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటిది ఈసారి ఫైన‌ల్లో మెస్సీ ఎదురుపడితే ఆ మజానే వేరు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. అది జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నా' అని కామెంట్ చేశాడు.

ఇది విన్న స్పెయిన్ అభిమానులు.. ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు అని కామెంట్ చేస్తున్నారు.  మ్యాచ్ విష‌యానికొస్తే మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత జ‌రిగిన సెమీఫైన‌ల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మ‌ట్టికరిపించింది. స్పెయిన్ త‌ర‌ఫున మికెల్ ఒజ‌ర్‌బ‌యాల్ (22వ నిమిషం), పెడ్రో పొర్రో (58వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఈసారి ఫిఫాలో ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. తాము ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లో క‌నీసం ఒక్క గోల్ అయినా కొట్టిన ఫ్రాన్స్ సెమీస్‌లో స్పెయిన్‌పై మాత్రం గోల్ చేయ‌డంలో విఫ‌ల‌మైంది. 

 

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)