Breaking News

సూపర్‌ ‘సఫారీ’

Published on Sun, 06/15/2025 - 01:08

దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్‌ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్‌ కప్‌ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్‌ కప్‌లు, 9 టి20 వరల్డ్‌ కప్‌లు, 9 చాంపియన్స్‌ ట్రోఫీలు, 2 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్‌ అందుకునే అవకాశమే రాలేదు... 

అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్‌’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌తో సఫారీ టీమ్‌ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్‌ అంటే చెలరేగిపోయే ఆసీస్‌ ఈ సారి మాత్రం బ్యాటింగ్‌ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్‌గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్‌ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్‌ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.

27.4 ఓవర్లలో 69 పరుగులు... 
ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్‌ అవుట్‌ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్‌ (8)ను స్టార్క్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్‌రమ్‌ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్‌హామ్‌ (21 నాటౌట్‌) అండగా నిలిచాడు. 

ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్‌రమ్‌ను హాజల్‌వుడ్‌ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్‌ వేసిన బంతిని వెరీన్‌ కవర్‌ పాయింట్‌ దిశగా ఆడి సింగిల్‌ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది.  

స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) హెడ్‌ (బి) హాజల్‌వుడ్‌ 136; రికెల్టన్‌ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 6; ముల్డర్‌ (సి) లబుషేన్‌ (బి) స్టార్క్‌ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్‌ 66; స్టబ్స్‌ (బి) స్టార్క్‌ 8; బెడింగ్‌హామ్‌ (నాటౌట్‌) 21; వెరీన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282.  వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్‌: స్టార్క్‌ 14.4–1–66–3, హాజల్‌వుడ్‌ 19–2–58–1, కమిన్స్‌ 17–0–59–1, లయన్‌ 26–4–66–0, వెబ్‌స్టర్‌ 5–0–13–0, హెడ్‌ 2–0–8–0. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)