25 ఏళ్లకే సౌతాఫ్రికా స్టార్ ఫుట్‌బాల‌ర్ క‌న్నుమూత‌

Published on Sun, 07/12/2026 - 08:43

ప్ర‌పంచం మొత్తం సాక‌ర్ ఫీవ‌ర్‌ (FIFA World Cup 2026)తో ఊగిపోతున్న వేళ ఫుట్‌బాల్ ఆట‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాసేప‌ట్లో ఫిఫా 2026 క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఇంగ్లండ్‌, నార్వే ఆట మొద‌ల‌వుతుంద‌న‌గా, స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై సౌతాఫ్రికా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ జేడ‌న్ ఆడ‌మ్స్ (25) క‌న్నుమూసిన‌ట్లు ప్ర‌త్య‌క్షమవ్వడం అభిమానుల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌, నార్వే ఆటగాళ్లు సహా అభిమానులంతా జేడన్‌ ఆడమ్స్‌ ఆకస్మిక మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


మౌనం పాటిస్తున్న ఇంగ్లండ్‌, నార్వే ఆటగాళ్లు

సౌతాఫ్రికా మిడ్ ఫీల్డ‌ర్ అయిన జేడ‌న్స్ ఆడ‌మ్స్ 25 ఏళ్ల వ‌య‌సులోనే త‌నువు చాలించాడు. అత‌డి ఆక‌స్మిక మృతి వెనుక కార‌ణాలు ఏంట‌నేది తెలియ‌ద‌ని పోలీసులు వెల్ల‌డించారు. అయితే జేడ‌న్ ఆడమ్స్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించినట్టు కొందరు అనుమానిస్తుంటే, వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు మరికొందరు పేర్కొంటున్నారు. 


ఫిఫా ప్రపంచకప్‌ 2026లో జేడన్‌ ఆడమ్స్‌

సౌతాఫ్రికా ఫుట్‌బాల్ జ‌ట్టులో స్టార్ ఆట‌గాడిగా పేరు పొందిన జేడ‌న్ ఆడ‌మ్స ఇటీవ‌లే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. సౌతాఫ్రికా గ్రూప్ ద‌శ‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ జేడ‌న్ ఆడ‌మ్స్ ఆడాడు. మెక్సికోతో మ్యాచ్‌కు ముందు త‌న అమ్మ‌మ్మ మ‌రియానా ఆడ‌మ్స్ మ‌ర‌ణించింద‌న్న వార్త‌ను దిగ‌మింగుకొని బ‌రిలోకి దిగిన జేడ‌న్ ఆడ‌మ్స్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 

ఆ మ్యాచ్‌లో మెక్సికో 2-0తో విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత చెక్ రిప‌బ్లిక్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న సౌతాఫ్రికా.. త‌మ చివ‌రి మ్యాచ్‌లో ద‌క్షిణ కొరియాపై 0-1తో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో జేడ‌న్ ఆడ‌మ్స్‌స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చాడు. ఆడమ్స్ మృతి పట్ల ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ ఫాంటినో, దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి గాయటన్ మెకెంజీలతో పాటు ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. సౌతాఫ్రికా తరపున 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జేడ‌న్ ఆడమ్స్ రెండు గోల్స్ చేశాడు.
 

 

 Read: టీ20 సిరీస్‌ ఓటమి.. నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్ గోవిందా

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)