Breaking News

చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Fri, 12/12/2025 - 09:05

టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్‌ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌((46 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 90) విధ్వంసం సృష్టించగా.. డొనవాన్‌ ఫెరీరా(16 బంతుల్లో 30), మిల్లర్‌(12 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అనంతరం భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బౌలర్ల దాటికి భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ బార్ట్‌మన్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. ఎంగిడీ, సిప్లమా, జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది.

ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌..
ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది పదమూడో విజయం.

ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్‌పై ఇప్పటివరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.

భారత్‌పై అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్లు
దక్షిణాఫ్రికా-13
ఆస్ట్రేలియా-12
ఇంగ్లాండ్‌-12
న్యూజిలాండ్-10
వెస్టిండీస్10
చదవండి: నేను.. అత‌డే ఈ ఓట‌మికి కార‌ణం! ప్ర‌తీసారి కూడా: సూర్యకుమార్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)