ఉత్కంఠ పోరు.. ఒక్క ప‌రుగు తేడాతో సౌతాఫ్రికా విజ‌యం

Published on Fri, 08/01/2025 - 07:56

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ అడుగుపెట్టింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌(6) త్వరగా ఔటైనప్పటికి.. స్మట్స్‌(57), వాన్ వైక్(76) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఆసీస్‌ బౌలర్లలో పీటర్‌ సిడల్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. ఆర్చీ షార్ట్‌, బ్రెట్‌లీ, క్రిస్టియన్‌ తలా వికెట్‌ సాధించారు.

పోరాడి ఓడిన ఆసీస్‌..
అనంతరం లక్ష​​ చేధనలో ఆసీస్‌కు షాన్‌ మార్ష్‌(25), క్రిస్‌ లిన్‌(35) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్‌(33), క్రిస్టియన్‌(49) ఆసీస్‌ను గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి.

వైన్‌ పార్నల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి క్వినీ సిక్స్‌ బాదగా.. రెండు బంతికి సింగిల్‌ తీసి క్రిస్టియన్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. మూడో బంతికి రెండు, నాలుగు బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత ఐదో బంతికి కూడా సింగిల్ రన్‌ మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి కంగారుల విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. డివిలియర్స్‌ అద్బుతమైన ఫీల్డింగ్‌తో ఒక్క రన్‌ మాత్రమే వచ్చింది.

రెండో పరుగు తీసే క్రమంలో కౌల్టర్‌ నైల్‌ రనౌటయ్యాడు. ఒకవేళ రెండో పరుగు పూర్తి చేసి ఉంటే మ్యాచ్‌ టై అయ్యిండేది. ఇక శనివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఫైనల్‌ పోరులో పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. కాగా ఇండియా ఛాంపియన్స్‌ సెమీఫైనల్‌కు ఆర్హత సాధించినప్పటికి, పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు.
చదవండి: IND vs ENG 5th Test: ఆధ‌ర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవ‌ర్‌గా అంపైర్‌! ఫ్యాన్స్ ఫైర్‌
 

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)