Breaking News

చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు

Published on Sun, 06/15/2025 - 09:39

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి డబ్ల్యూటీసీ గదను ప్రోటీస్ జట్టు సొంతం చేసుకుంది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మార్‌క్రమ్ అద్భుత సెంచరీ (136)తో సఫారీలు చిరస్మరణీయ విజయం అందుకున్నారు.

అతడితో కెప్టెన్ టెంబా బవూమా (66 పరుగులు) రాణించాడు. ప్రోటీస్ జ‌ట్టుకు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావ‌డం విశేషం. .1998లో సౌతాఫ్రికాకు హాన్సీ క్రోన్జే ఐసీసీ ట్రోఫీని అందించ‌గా.. ఇప్పుడు 27 ఏళ్ల త‌ర్వాత బావుమా తిరిగి మ‌ళ్లీ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిలిపాడు. ఇక చారిత్ర‌త్మ‌క విజ‌యం సాధించిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌మ ఖాతాలో వేసుకుంది.

టీమిండియా వ‌ర‌ల్డ్ రికార్డు బ‌ద్ద‌లు..
👉ఐసీసీ టోర్న‌మెంట్‌ ఫైన‌ల్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికా వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై.. ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు 275 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్‌లో 282 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.

👉అదేవిధంగా లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక టార్గెట్‌ను చేధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ సరసన దక్షిణాఫ్రికా నిలిచింది. 2004లో న్యూజిలాండ్‌పై 282 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ చేధించగా.. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే లక్ష్యాన్ని ప్రోటీస్ ఛేజ్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ అగ్రస్ధానంలో ఉంది. 1984లో ఇంగ్లండ్‌పై 344 పరుగుల టార్గెట్‌ను విండీస్ చేధించింది.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)