Breaking News

రోహిత్‌కే కాదు.. నాకు ద్రవిడ్‌కు ఇలానే జరిగింది: సౌరవ్‌ గంగూలీ

Published on Fri, 10/10/2025 - 19:16

భార‌త వ‌న్డే జ‌ట్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ స్ధానంలో యువ ఆట‌గాడు శుబ్‌మ‌న్ గిల్‌ను బీసీసీఐ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ ఈ ఆక‌స్మిక నిర్ణ‌యం తీసుకుంది. దీంతో చాలా మంది సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు.

రోహిత్‌ను కావాల‌నే కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌ని విమర్శించారు. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా ఉద్దేశ‌పూర్వ‌కంగానే తొలగించారనే వాద‌న‌ను గంగూలీ తోసిపుచ్చాడు. ప్ర‌తీ కెప్టెన్‌కు కెరీర్ ఎండ్ స‌మ‌యంలో ఇలా జ‌రుగుతుంద‌ని దాదా అభిప్రాయ‌ప‌డ్డాడు. రోహిత్ ఇక‌పై వ‌న్డే జ‌ట్టులో ప్లేయ‌ర్‌గా కొన‌సాగ‌నున్నాడు. అయితే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027లో హిట్‌మ్యాన్‌ ఆడుతాడో లేదో ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

"రోహిత్‌తో మాట్లాడిన త‌ర్వాతే సెల‌క్ట‌ర్లు ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటారు.  ఉద్దేశ‌పూర్వ‌కంగా అయితే అత‌డిని  త‌ప్పించి ఉండ‌రు. రోహిత్‌, సెలక్టర్ల మధ్య పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు చోటు చేసుకుందని అనుకుంటున్నా. రోహిత్ ఒక అద్భుత‌మైన కెప్టెన్‌. అత‌డు భార‌త్‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, ఛాంపియ‌న్స్ ట్రోఫీ టైటిల్స్‌ను అందించాడు.

వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా రోహిత్ ముందంజలో ఉన్నాడు. ఇక్కడ రోహిత్ కెప్టెన్సీ, ఫెర్మామ్మెన్స్ సమస్య కాదు. 2027 నాటికి రోహిత్‌కు  40 ఏళ్లు వస్తాయి. క్రికెట్‌లో వయస్సు పరంగా అది చాలా ఎక్కవ నంబర్‌. కెరీర్ ఆఖరిలో ప్రతీ కెప్టెన్‌కు ఇలానే జరుగుతోంది. నాకు,ద్రవిడ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 

శుబ్‌మన్ గిల్ కూడా 40 ఏళ్ల వయస్సులో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాడు. జేంటిల్‌మ్యాన్ గేమ్‌లో ప్రతీ ఒక్కరు ఏదో రోజున తమ కెరీర్‌ను ముగించాల్సిందే. గిల్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం సరైన నిర్ణయమే. అతడు ఇంగ్లండ్ టూర్‌లో అద్భుతంగా జట్టును నడిపించాడు. కెప్టెన్‌గా గిల్ ఎదిగే వరకు రోహిత్ ఆడుతూనే ఉండవచ్చు" ఓ ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: కెప్టెన్‌గా శార్ధూల్ ఠాకూర్‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ రీ ఎంట్రీ! నో సూర్య కుమార్‌?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)