'ప్రధాన కోచ్‌ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!'

Published on Sat, 07/22/2023 - 11:24

టీమిండియా మహిళా జట్టు ప్రస్తుతం హెడ్‌కోచ్‌ లేకుండానే సిరీస్‌లు ఆడుతోంది. గతేడాది డిసెంబర్‌లో రమేశ్‌ పవార్‌ను ఎన్‌సీఏకు పంపించినప్పటి నుంచి మహిళల హెడ్‌కోచ్‌ పదవి ఖాళీగానే ఉంది. ఈ మధ్యలో భారత మహిళల జట్టు కోచ్‌ లేకుండానే టి20 వరల్డ్‌కప్‌ ఆడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను కూడా కోచ్‌ లేకుండానే ఆడుతుంది. సరైన వ్యక్తి కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహిళల జట్టుకు కొత్త కోచ్‌ వచ్చే అవకాశముంది.

ఈ నేపథ్యంలో టీమిండియా వుమెన్స్‌ వైస్‌కెప్టెన్‌ స్మృతి మంధాన ప్రధాన కోచ్‌ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటివరకు 1-1తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. కీలకమైన మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. అయితే మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన మీడియా సమావేశంలో పాల్గొంది.

మంధాన మాట్లాడుతూ.. ''సరైన ప్రధాన కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. జట్టు కోసం సుధీర్ఘంగా సేవలు అందించే కోచ్‌ను ఎంపిక చేయాలనేది బోర్డు ఉద్దేశం. ఆటగాళ్ల నుంచి చూస్తే మాకు కోచ్‌ లేకపోవడం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. నాణ్యమైన క్రికెట్‌ ఆడినంత కాలం కోచ్‌ లేకపోయినా టీమిండియా మహిళా జట్టుకు గెలిచే సత్తా ఉంటుంది. ప్రధాన కోచ్‌ లేకపోయినప్పటికి ఇతర కోచింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

వారి సూచనలు తీసుకుంటూ ముందు సాగుతున్నాం. వారిచ్చే సూచనలు మాకు ఉపయోగపడుతున్నాయి. మా చుట్టూ ఏం జరుగుతుందనేది జట్టుగా మాకు ముఖ్యం కాదు. మైదానంలో ఎలా ఆడుతున్నామన్నదే కీలకం. ఈ సిరీస్‌ ముగిసేలోగా జట్టు ప్రధాన కోచ్‌ విషయమై బీసీసీఐ నుంచి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి. ప్రధాన కోచ్‌గా ఎవరొచ్చినా వారి సూచనలు, సలహాలు తీసుకొని జట్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ తెలిపింది.

చదవండి: Emerging Asia Cup:'నువ్వు మొదలెట్టావ్‌.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'

దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు!

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)