Breaking News

స్మృతి మంధాన పెళ్లి డేట్‌ ఫిక్స్‌!.. వరుడు ఎవరంటే?

Published on Thu, 10/30/2025 - 15:39

భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana Wedding) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ స్టైలిష్‌ ఓపెనర్‌ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మహిళా క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది.

భారత జట్టు ఓపెనర్‌గా 
భారత జట్టు ఓపెనర్‌గా ఇప్పటికే వన్డేల్లో 115 మ్యాచ్‌లు ఆడి.. 14 శతకాల సాయంతో 5253 పరుగులు సాధించిన స్మృతి.. ఏడు టెస్టుల్లో 629 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 153 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 3982 పరుగులు సాధించింది. అంతేకాదు.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WCL)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఫ్రాంఛైజీకి తొలి టైటిల్‌ అందించిన ఘనత ఆమెది.

ఆరేళ్లుగా ప్రేమ
ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్‌-2025తో బిజీగా ఉన్న స్మృతి మంధాన.. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆమె పెళ్లి పనుల్లో తలమునకలు కానున్నట్లు సమాచారం. కాగా స్మృతి చాన్నాళ్లుగా.. మ్యూజిక్‌ కంపోజర్‌ పలాష్‌ ముచ్చల్‌ (Palash Muchhal)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్‌ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్‌షిప్‌ గురించి అభిమానులతో పంచుకున్నారు.

ఇండోర్‌ కోడలు కాబోతోంది
ఆ తర్వాత ప్రతి వేడుకలోనూ కలిసి కనిపించారు స్మృతి- పలాష్‌. స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు పలాష్‌. ఇటీవల.. ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్‌ కోడలు కాబోతోంది’’ అంటూ పలాష్‌ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు.

కాగా 1996లో ముంబైలో జన్మించిన స్మృతి మంధాన.. తనకు రెండేళ్ల వయసు ఉన్నపుడు సాంగ్లీకి వెళ్లింది. మాధవ్‌నగర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మరోవైపు.. పలాష్‌ 1995లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు.  

శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న అతడు.. బాలీవుడ్‌లో కంపోజర్‌గా సిర్థపడ్డాడు. పలాష్‌ సోదరి పాలక్‌ ముచ్చల్‌ కూడా బాలీవుడ్‌ సింగర్‌. తనకు కూడా స్మృతితో మంచి అనుబంధం ఉందని పాలక్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

పెళ్లి డేట్‌ ఫిక్స్‌!
ఇక స్మృతి స్వస్థలం సాంగ్లీలోనే పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 20న స్మృతి- పలాష్‌ పెళ్లి తంతు జరుగనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ‘అమ్మానాన్నల్ని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను’

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)