Breaking News

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌

Published on Sun, 10/12/2025 - 16:14

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 

వన్డే వరల్డ్‌కప్‌ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్‌ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్‌తో చేరుకోవడం మరో విశేషం.

వన్డేల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్‌ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్‌ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్‌వైట్‌ (2016లో 853) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వైజాగ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్‌ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

మంధన@18
మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్‌లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్‌ కూడా 18 కావడం విశేషం.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్‌ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం​ భారత్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఆసీస్‌ విషయానికొస్తే.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్‌ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్‌ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్‌ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది.

చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి జట్టు

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)