Breaking News

సీఎస్‌కే బ్యాటర్‌ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే..

Published on Wed, 11/26/2025 - 18:07

దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy 2025)లో గుజరాత్‌ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్‌-సి గ్రూపులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో సర్వీసెస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్‌ ఉర్విల్‌ పటేల్‌ (Urvil Patel) విధ్వంసకర శతకం కారణంగా గుజరాత్‌ విజయం నల్లేరు మీద నడకలా మారింది.

182 పరుగులు
హైదరాబాద్‌లోని జింఖాన స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్‌ గౌరవ్‌ కొచ్చర్‌ (37 బంతుల్లో 60) మెరుపు అర్ధ శతకం బాదగా.. అరుణ్‌ కుమార్‌ (29), జయంత్‌ గోయత్‌ (7 బంతుల్లో 29) రాణించారు.

గుజరాత్‌ బౌలర్లలో హేమాంగ్‌ పటేల్‌, అర్జాన్‌ నాగ్వాస్వల్లా చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షల్‌ పటేల్‌, రవి బిష్షోయి, విశాల్‌ జేస్వాల్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఆది నుంచే దూసుకుపోయింది.

చెలరేగిన ఓపెనర్లు
ఓపెనర్లలో ఆర్య దేశాయ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (35 బంతుల్లో 60)తో హాఫ్‌ సెంచరీ చేయగా.. కెప్టెన్‌ ఉర్విల్‌ పటేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.

321కి పైగా స్ట్రైక్‌రేటుతో
ఉర్విల్‌ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. 321కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టడం గమనార్హం. మిగతావారిలో రిపాల్‌ పటేల్‌ డకౌట్‌ అయినా పెద్దగా ప్రభావం పడలేదు. 12.3 ఓవర్లలోనే కేవం రెండు వికెట్లు నష్టపోయి గుజరాత్‌ 183 పరుగులు చేసి జయభేరి మోగించింది. శతక వీరుడు ఉర్విల్‌ పటేల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

నమ్మకం నిలబెట్టుకున్నాడు
కాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు ఉర్విల్‌ పటేల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు చెన్నై అతడిని రిటైన్‌ చేసుకుంది. ఇక ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సొంత జట్టు గుజరాత్‌ తరఫున ఉర్విల్‌ తొలి మ్యాచ్‌లోనే ఇరగదీయడం గమనార్హం. కాగా ఏడాది ఐపీఎల్‌లో ఉర్విల్‌ మూడు మ్యాచ్‌లు ఆడి 68 పరుగులు చేశాడు.

చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)