Breaking News

నిప్పులు చెరిగిన సిరాజ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు చుక్కలు

Published on Fri, 12/12/2025 - 22:58

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెలరేగిపోయాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు. 3.5 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

సిరాజ్‌ విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 18.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌తో పాటు చామా మిలింద్‌ (4-0-36-2), త్యాగరాజన్‌ (4-0-27-2), నితిన్‌ సాయి యాదవ్‌ (3-0-26-1), అర్ఫాజ్‌ అహ్మద్‌ (1-0-7-1) సత్తా చాటారు.

స్టార్లతో నిండిన ముంబై ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (29), హార్దిక్‌ తామోర్‌ (29), సూర్యాంశ్‌ షేడ్గే (28), సాయిరాజ్‌ పాటిల్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రహానే (9), సర్ఫరాజ్‌ ఖాన్‌ (5), రఘువంశీ (4), అంకోలేకర్‌ (3), తనుశ్‌ కోటియన్‌ (2), తుషార్‌ దేశ్‌పాండే (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ డకౌటయ్యాడు.

అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్‌ ఓపెనర్లు అమన్‌ రావ్‌ (29 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్‌ అగర్వాల్‌ (40 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరి ధాటికి హైదరాబాద్‌ 11.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సూపర్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా జరిగింది.

 

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)