Breaking News

శతక్కొట్టిన అభిషేక్‌ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర

Published on Sun, 11/30/2025 - 14:08

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అదరగొట్టాడు. బెంగాల్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పంజాబ్‌ కెప్టెన్‌.. భారీ శతకం బాదాడు. కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకున్నాడు.

ఆది నుంచే బౌలర్లపై అటాక్‌
దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 (SMAT)లో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌-‘సి’లో పంజాబ్‌- బెంగాల్‌ (Punjab Vs Bengal) తలపడ్డాయి. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (Prabhsimran Singh) ఆది నుంచే బెంగాల్‌ బౌలర్లపై దాడికి దిగారు.

148 పరుగులు
ఆకాశమే హద్దుగా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 148 పరుగులు సాధించాడు. అయితే, ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో వ్రితిక్‌ ఛటర్జీకి క్యాచ్‌ ఇవ్వడంతో అభిషేక్‌ సునామీ ఇన్నింగ్స్‌​కు తెరపడింది.

మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 35 బంతుల్లోనే 70 పరుగుల సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో పాటు 4 సిక్స్‌లు ఉన్నాయి. మిగతా వారిలో రమణ్‌దీప్‌ సింగ్‌ (15 బంతుల్లో 39), సన్వీర్‌ సింగ్‌ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (6 బంతుల్లో 11) కాస్త నిరాశపరిచాడు.

ఇక నమన్‌ ధిర్‌ (2 బంతుల్లో 7),  నేహాల్‌ వధేరా (2 బంతుల్లో 2) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన పంజాబ్‌ ఏకంగా 301 పరుగులు సాధించింది. బెంగాల్‌ బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ రెండు వికెట్లు తీయగా.. మొహమ్మద్‌ షమీ, షక్షైమ్‌ చౌదరి, ప్రదీప్త ప్రామాణిక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 198 పరుగులే చేసింది. పంజాబ్‌ బౌలర్ల ధాటికి బెంగాల్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 66 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్స్‌లు బాది 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అభిమన్యుకు తోడుగా.. పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (7 బంతుల్లో 31) ఒక్కడే మెరుపు వేగంతో పరుగులు రాబట్టాడు. అయితే, మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పంజాబ్‌ చేతిలో బెంగాల్‌ ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 

పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నేహాల్‌ వధేరా, గుర్నూర్‌ బ్రార్‌ చెరో రెండు.. అభిషేక్‌ శర్మ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. భారీ సెంచరీతో కదం తొక్కి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ
బెంగాల్‌తో మ్యాచ్‌లో 148 పరుగులు సాధించిన అభిషేక్‌ శర్మ (16 సిక్సర్లు) అరుదైన రికార్డు సాధించాడు. టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో 17 సిక్స్‌లు (146 నాటౌట్‌)తో మేఘాలయ బ్యాటర్‌ పునిత్‌ బిస్త్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

కాగా టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా తిలక్‌ వర్మ కొనసాగుతున్నాడు. గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నీలో ఈ హైదరాబాదీ 67 బంతుల్లో 151 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి.

చదవండి: IND vs SA: టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. రుతురాజ్‌కు చోటు.. పంత్‌కు నో ఛాన్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)