SL vs AFG: ఫైనల్లో భారత్‌ ప్రత్యర్థి ఎవరంటే?

Published on Fri, 06/19/2026 - 18:18

ముక్కోణపు సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్‌, లంక, అఫ్గాన్‌ జట్ల మధ్య ట్రై సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్‌.. తర్వాత అఫ్గాన్‌, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్‌ దశలో చివరగా అఫ్గనిస్తాన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏక​ంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్‌ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్‌ డిక్‌విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్‌ ఆర్డర్‌లో రవిందు ఫెర్నాండో 25 రన్స్‌ రాబట్టాడు.

ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరీదూన్‌ దావూద్జాయ్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్‌ ఇబ్రహీం ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్‌, కెప్టెన్‌ ఇమ్రాన్‌ మిర్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ నూర్‌ ఉల్‌ రహ్మాన్‌ను దులాజ్‌ సముదిత డకౌట్‌ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్‌ హసన్‌ ఎసాఖిల్‌ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్‌ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు.  

అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్‌ ఆలౌట్‌ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్‌ సముదిత్‌ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. కుగాతస్‌ మతూలన్‌ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్‌ వియస్కాంత్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. భారత్‌- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్‌కు దంబుల్లా వేదిక.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)