Breaking News

ఇదెక్కడి క్రేజీ క్యాచ్‌ రా సామీ.. నమ్మశక్యంగా లేదు..!

Published on Fri, 02/02/2024 - 19:12

క్రికెట్‌ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్‌ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక వికెట్‌కీపర్‌ సదీర సమరవిక్రమ నమ్మశక్యంకాని రీతిలో క్రేజీ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ చూసిన వాళ్లు 'కలయా నిజమా..' అని అంటున్నారు. సమరవిక్రమ ముందుచూపుకు హ్యాట్సాఫ్‌ అంటున్నారు.

ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో ఆఫ్ఘన్‌ ఆటగాడు రెహ్మత్‌ షా లెగ్‌సైడ్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. సాధారణంగా అయితే ఈ షాట్‌ వికెట్‌కీపర్‌కు చాలా దూరంగా (లెగ్‌ స్లిప్‌ అనవచ్చు) వెళ్తూ బౌండరీకి చేరుకుంటుంది. అయితే షా ఈ షాట్‌ ఆడతాడని ముందుగానే పసిగట్టిన సమరవిక్రమ బంతి పిచ్‌ కాగానే లెగ్‌సైడ్‌ దిశగా వెళ్లి తక్కువ ఎత్తులో గాల్లోకి లేచిన బంతిని ఇట్టే పట్టేసుకున్నాడు. బ్యాటర్‌, బౌలర్‌ సహా ఈ తంతు మొత్తం చూస్తున్న వారు నివ్వెరపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. 

కాగా, స్వదేశంలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో (14.4-1-24-3), విశ్వ ఫెర్నాండో (12-1-51-4), ప్రభాత్‌ జయసూర్య (25-7-67-3) విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. 
 
టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. రెండో బంతికే ఆఫ్ఘన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ను (0) పెవిలియన్‌కు పంపింది. ఆతర్వాత వన్‌డౌన్‌ ఆటగాడు రెహ్మత్‌ షా (91).. మరో ఓపెనర్‌, అరంగేట్రం ఆటగాడు నూర్‌ అలీ జద్రాన్‌తో (31) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

సమరవిక్రమ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌ అయిన రెహ్మత్‌ షాను పెవిలియన్‌కు పంపిన అనంతరం ఆఫ్ఘన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌  హష్మతుల్లా షాహిది 17, నసీర్‌ జమాల్‌ 0, ఇక్రమ్‌ అలికిల్‌ 21, కైస్‌ అహ్మద్‌ 21, జియా ఉర్‌ రెహ్మాన్‌ 4, నిజత్‌ మసూద్ 12, మొహమ్మద్‌ సలీం 0 పరుగులకు ఔటయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్‌ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్లు (నూర్‌ అలీ జద్రాన్‌, నవీద్‌ జద్రాన్‌, జియా ఉర్‌ రెహ్మాన్‌ అక్బర్‌, మొహమ్మద్‌ సలీం) టెస్ట్‌ అరంగేట్రం చేయడం విశేషం. 

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. నిషాన్‌ మధుష్క (36), దిముత్‌ కరుణరత్నే (42) క్రీజ్‌లో ఉన్నారు. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)