Breaking News

రోహిత్‌ శర్మ రికార్డును సమం చేసిన సికందర్‌ రజా

Published on Sun, 07/26/2026 - 09:49

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఓ అవాంఛిత విషయంలో టీమిండియా డాషింగ్‌ బ్యాటర్‌ రోహిత్, పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్ ఆజం​ రికార్డును సమం చేశాడు. నిన్న (జులై 25) భారత్‌తో జరిగిన రెండో టీ20లో డకౌట్‌ కావడంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక డక్స్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌, బాబర్‌ సరసన చేరాడు.

కెప్టెన్‌గా రజాకు ఇది ఆరో డక్. రోహిత్‌, బాబర్‌ కూడా కెప్టెన్లుగా ఇన్నే డక్స్‌ నమోదు చేశారు. దీంతో వీరు ముగ్గురు అత్యధిక డక్స్ నమోదు చేసిన ఐసీసీ ఫుల్‌టైమ్‌ సభ్య దేశాల కెప్టెన్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎనిమిది డక్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక డక్స్ (పూర్తి సభ్య దేశాలు):

* 8 – ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
* 6 – రోహిత్ శర్మ (భారత్)
* 6 – బాబర్ ఆజం (పాకిస్థాన్)
* 6 – సికందర్ రజా (జింబాబ్వే)

అంతేకాకుండా, ఈ డక్‌తో రజా టీ20ల్లో జింబాబ్వే తరఫున 10 డక్స్ నమోదు చేసి, ఆ జట్టు తరఫున అత్యధిక డక్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. రెజిస్ చకాబ్వా 11 డక్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

భారత్‌తో రెండో టీ20 విషయానికొస్తే.. జింబాబ్వేపై భారత్‌ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీనికి ముందు తొలి టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అ‍య్యర్‌కు ఇది తొలి సిరీస్‌ విజయం. మిగిలిన నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (జులై 26) అదే వేదికగా జరుగనుంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)